Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..

మలయాళ హీరో.. నిర్మాత విజయ్ బాబు (Vijay Babu) తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..
Vijay Babu

Updated on: May 02, 2022 | 8:45 AM

మలయాళ హీరో.. నిర్మాత విజయ్ బాబు (Vijay Babu) తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని.. విజయ్ బాబు వలన తాను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో విజయ్ బాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎర్కాకుళం పోలీసులు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే ఆ మహిళ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ విజయ్ లైవ్ వీడియో రిలీజ్ చేశాడు. తాజాగా విజయ్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టీస్ట్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి తప్పుకున్నారు. అసోసియేషన్‏ను అవమానం నుంచి రక్షించడానికి.. అలాగే తాను లైంగిక కేసులో నిర్ధోషి అని నిరూపించుకునే వరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపారు విజయ్..

విజయ్ బాబు తనపై ఆరోపణలు రావడంతో.. తాను ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సంస్థకు ఎలాంటి కళంకం తీసుకురావాలని కోరుకోవడం లేదని…. తాను నిర్దోషి అని రుజువు అయ్యేంతవరకు ఎగ్జిక్యూటివ్ కమిటీకి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు అమ్మ కమిటీకి లేఖ పంపారు. విజయ్ లేఖపై చర్చించిన అనంతరం అమ్మ సంస్థ అతని లేఖను ఆమోదించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ముందస్తు బెయిల్ పిటిషన్‏ను పరిశీలించేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. లైంగిక కేసులో తనను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ విజయ్ ముందుస్తు బెయిల్ పిటిషన్లో పేర్కోన్నారు. అలాగే.. విజయ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇటీవల ఫేస్ బుక్ ద్వారా బాధిత మహిళ వివరాలు వెల్లడించినందుకు అతనిపై మరో కేసు నమోదు చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Sarkaru vaari paata: సూపర్‌ స్టార్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. సర్కారు వారి పాట ట్రైలర్‌

వచ్చేస్తోంది..

AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..

Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?

F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ సిద్ధం చేసిన ఎఫ్‌3 టీమ్‌.. పేలనున్న ఫన్‌ బాంబ్‌..