సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ నటిస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబాయి తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అడవి శేష్ జన్మదినం సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అడవి శేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అడవి శేష్ కెరీర్‌లో ఎంతో ఉత్తమమైన నటనలో గా మేజర్ నిలుస్తుందని మహేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
గూఢచారి,ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ సినమాలను తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్ మెంట్, ఏప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైయీం మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సంవత్సరం వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy to present the first look of #Major!! Wishing you a very happy birthday @AdiviSesh. I'm sure Major will go down as one of your best performances. Good luck and happiness always! ? pic.twitter.com/q5BLRj8ewn
— Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2020