Mahesh Babu’s Sarkaru Vaari Paata : మహేష్ ‘సర్కారు వారి పాట’ నేషనల్ వైడ్ రిలీజ్ అవ్వబోతుందా..?

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న..

Mahesh Babu’s Sarkaru Vaari Paata : మహేష్ సర్కారు వారి పాట నేషనల్ వైడ్ రిలీజ్ అవ్వబోతుందా..?

Updated on: Jan 20, 2021 | 6:03 AM

Mahesh Babu’s Sarkaru Vaari Paata : సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు పాన్ ఇండియా ఫిలిం చేయలేదు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం పాన్ ఇండియా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చే సినిమా ఎలాగైనా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు. అయితే మహేష్ ”సర్కారు వారి పాట” ను నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండే కథాంశం అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు