AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు నిర్మాణసంస్థలో వరుసగా పట్టాలెక్కుతున్న సినిమాలు.. త్వరలో ఆ యంగ్ హీరోతో కూడా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మహేష్ బాబు నిర్మాణసంస్థలో వరుసగా పట్టాలెక్కుతున్న సినిమాలు.. త్వరలో ఆ యంగ్ హీరోతో కూడా..
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2020 | 10:58 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు మెగాస్టార్ మూవీ టైటిల్ ‘స్టేట్ రౌడీ’ను కూడా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే మహేష్ హీరోగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే అడవి శేష్ హీరోగా మేజర్ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. నవీన్ పొలిశెట్టి ని హీరోగా పెట్టి ఒక సినిమాను మహేష్ బాబు చేసేందుకు సిద్దంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు బ్యానర్ లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి