అచ్చొచ్చిన స్టేడియం.. అందుకే..!

నిన్నటి సూపర్‌స్టార్‌ కృష్ణ.. ఇవాళ్టి నయా సూపర్‌స్టార్ మహేష్‌బాబు.. వీళ్లిద్దరికీ ఫిజికల్‌గా ఉండే పోలికలు అటుంచితే.. మనసు-మేనరిజంలో కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కృష్ణలాగే మహేష్ బాబుకు కూడా మాస్‌ అండ్ క్లాస్‌.. రెండువర్గాలను ఎట్రాక్ట్ చేసేంత  స్టార్‌డమ్‌ ఉంది. తండ్రిలాగే అభిమానుల్ని ప్రాణప్రదంగా భావిస్తారు మహేష్‌బాబు. సినిమా వేడుకల ద్వారా ఆ ప్రేమను ఘనంగా ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు కూడా. తాను ఇష్టపడి చేసిన ‘భరత్ అనే నేను’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని.. ఎల్‌బీ స్టేడియంలో ఓపెన్‌ఎయిర్‌లో […]

అచ్చొచ్చిన స్టేడియం.. అందుకే..!

Edited By:

Updated on: Jan 05, 2020 | 4:54 PM

నిన్నటి సూపర్‌స్టార్‌ కృష్ణ.. ఇవాళ్టి నయా సూపర్‌స్టార్ మహేష్‌బాబు.. వీళ్లిద్దరికీ ఫిజికల్‌గా ఉండే పోలికలు అటుంచితే.. మనసు-మేనరిజంలో కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కృష్ణలాగే మహేష్ బాబుకు కూడా మాస్‌ అండ్ క్లాస్‌.. రెండువర్గాలను ఎట్రాక్ట్ చేసేంత  స్టార్‌డమ్‌ ఉంది. తండ్రిలాగే అభిమానుల్ని ప్రాణప్రదంగా భావిస్తారు మహేష్‌బాబు. సినిమా వేడుకల ద్వారా ఆ ప్రేమను ఘనంగా ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు కూడా. తాను ఇష్టపడి చేసిన ‘భరత్ అనే నేను’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని.. ఎల్‌బీ స్టేడియంలో ఓపెన్‌ఎయిర్‌లో భారీస్థాయిలో నిర్వహించారు.

ఇక అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి చీఫ్‌గెస్ట్ హోదానిచ్చి.. తన మనసును చాటుకున్నారు మహేష్‌బాబు. ఫ్యాన్స్‌ మధ్య డిఫరెన్సెస్‌ ఉండొద్దని మంచి సంకేతమిచ్చారు కూడా. ఇక ఈ మూవీ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. మహర్షి తర్వాత మూవీ సరిలేరు నీకెవ్వరు.. నూటికినూరు శాతం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో దట్టించినట్లు రెడీ ఐంది. ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ప్రేక్షకుడికీ ఈ మూవీని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నారు. అందుకే.. ఎల్‌బీ స్టేడియం వేదికయ్యింది.. మెగాస్టార్ ముఖ్య అతిథి హాజరు కానున్నారు.

రెండేళ్ల కిందట యంగ్ టైగర్‌ని ఇన్వైట్ చేశారు.. ఇప్పుడు అదే వేదిక మీద మెగాస్టార్‌తో గ్రూప్‌ ఫోటోకి సిద్ధమయ్యారు. ఈవిధంగా సూపర్‌స్టార్ మరోసారి మనసు దోచుకున్నారు. భారీస్థాయిలో జరగబోయే ఈ వేడుకతో మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి పండగ ముందే వచ్చినట్లుంది. ఇక.. 11న రిలీజయ్యే సినిమా చూస్తే వాళ్లందరి గుండెలు నిండినట్లేగా..!