AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలర్ ఎగరేసిన ‘మహర్షి’

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు..టాలీవుడ్‌లో ఈ హీరో ఇమేజ్ వేరు. ‘రీల్’ లైఫ్ అయినా..’రియల్’ లైఫ్ అయినా మహేశ్ మిస్టర్ పర్‌ఫెక్ట్. కథను నమ్మి డైరక్టర్ చెప్పింది చెస్తూ, వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటాడు. ఎంత హిట్ వచ్చినా..భారీ డిజాస్టర్ వచ్చినా మహేశ్ బిహేవియర్‌లో పెద్దగా మార్పు ఉండదు. కానీ మహర్షి సినిమా ఈ స్టార్ హీరోలో అసాధారణమైన మార్పును తీసుకొచ్చింది. ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా వేదికలపై ఒక్క డైలాగ్ కూడా చెప్పని మహేశ్ […]

కాలర్ ఎగరేసిన 'మహర్షి'
Ram Naramaneni
|

Updated on: May 13, 2019 | 3:12 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు..టాలీవుడ్‌లో ఈ హీరో ఇమేజ్ వేరు. ‘రీల్’ లైఫ్ అయినా..’రియల్’ లైఫ్ అయినా మహేశ్ మిస్టర్ పర్‌ఫెక్ట్. కథను నమ్మి డైరక్టర్ చెప్పింది చెస్తూ, వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటాడు. ఎంత హిట్ వచ్చినా..భారీ డిజాస్టర్ వచ్చినా మహేశ్ బిహేవియర్‌లో పెద్దగా మార్పు ఉండదు. కానీ మహర్షి సినిమా ఈ స్టార్ హీరోలో అసాధారణమైన మార్పును తీసుకొచ్చింది. ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా వేదికలపై ఒక్క డైలాగ్ కూడా చెప్పని మహేశ్ ఏకంగా కాలర్ ఎగరేశాడు.

మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పిన మాటలను ప్రస్తావించిన మహేశ్..ఈ చిత్రం చూసిన త‌ర్వాత నాన్న‌గారి అభిమానుల‌తో పాటు నా అభిమానులు కూడా కాల‌ర్ ఎగ‌రేసుకునే సినిమా ఇది అవుతుంద‌ని వంశీ  చెప్పాడు.. నిజంగానే మా ఫ్యాన్స్ ఎగరేస్తున్నారు..ఇప్పుడు నేను కూడా ఎగరేస్తాను అని కాలర్ ఎగరేశాడు సూపర్ స్టార్. ఈ సందర్భంగా దర్శకుడికి  థ్యాంక్స్ చెబుతూ మహేశ్ ఎమోషనల్ అయ్యాడు. అది చూసిన త‌ర్వాత అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. మ‌హ‌ర్షి సినిమా మూడు రోజుల్లోనే 50 కోట్ల‌కు పైగా షేర్.. 80 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది.

Follow Us