‘మహర్షి’ మూవీ విడుదలపై క్లారిటీ!

|

Mar 06, 2019 | 12:01 PM

హైదరాబాద్: మహేశ్ బాబు నటించిన మహర్షి మూవీ విడుదల తేదీపై ఏర్పాడిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. మొదటి దీన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించారు. కానీ తర్వాత షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 25కి మార్చారు. అయితే ఆ డేట్ కూడా మారనుందంటూ గందరగోళ పరిస్థి ఏర్పడింది. దీంతో ఈ కన్ఫ్యూజన్‌కు తెరదించే ప్రయత్నం జరిగింది. అనుకున్న సమయానికే సినిమా విడుదల అవుతుందని యూనిట్ ప్రకటించింది. కానీ సినిమా షూటింగ్ ఏప్రిల్ […]

మహర్షి మూవీ విడుదలపై క్లారిటీ!
Follow us on

హైదరాబాద్: మహేశ్ బాబు నటించిన మహర్షి మూవీ విడుదల తేదీపై ఏర్పాడిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. మొదటి దీన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించారు. కానీ తర్వాత షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 25కి మార్చారు. అయితే ఆ డేట్ కూడా మారనుందంటూ గందరగోళ పరిస్థి ఏర్పడింది. దీంతో ఈ కన్ఫ్యూజన్‌కు తెరదించే ప్రయత్నం జరిగింది. అనుకున్న సమయానికే సినిమా విడుదల అవుతుందని యూనిట్ ప్రకటించింది.

కానీ సినిమా షూటింగ్ ఏప్రిల్ 16కి ముగిసే అవకాశం ఉందట. మరి ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న సినిమా రిలీజ్ చేయాలంటే కష్టమే. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆ సమయం సరిపోదు. మూవీని ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. అందుకే విడుదల తేదీని మే నెలకు మరుద్దామనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఏప్రిల్‌లో విడుదలైన మహేశ్ సినిమాలు హిట్ సాధించాయి. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఏప్రిల్ నెలలో విడుదలను సెంటిమెంట్‌గా భావిస్తారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మహేశ్ హిట్ సినిమాలన్నీ సమ్మర్‌లో విడుదలైనవే. కాబట్టి ఫ్యాన్స్ కంగారుపడాల్సిందేమీ లేదనే ప్రచారం జరుగుతోంది.