తెరపైకి మరో బయోపిక్.. రతన్ టాటా జీవిత కథలో మాధవన్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా పేరుతో రాబోతున్న బయోపిక్‌లో తాను నటించడం లేదని హీరో మాధవన్ స్పష్టం చేశారు.
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా పేరుతో రాబోతున్న బయోపిక్‌లో తాను నటించడం లేదని హీరో మాధవన్ స్పష్టం చేశారు. ఇటీవల రతన్ టాటా జీవిత కథ నేపథ్యంలో ఓ సినిమా రాబోతుందని, అందులో హీరో మాధవన్ మెయిల్ రోల్లో నటించనున్నారని ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ రూమర్స్ పై శనివారం మాధవన్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ” హే దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానులు ఈ ఫేక్ పోస్టును క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నట్టున్నారు. ఇందులో ఏంతమాత్రం నిజం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం ఇంతవరకు నా దగ్గరకు రాలేదు. అందుకోసం ఎవరితోనూ.. ఎలాంటి చర్చలు జరగలేదు” అని మాధవన్ పేర్కొన్నారు.
కాగా ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పారిశ్రామిక వేత్త రతన్ టాటా బయోపిక్ ఆధారంగా ఓ సినిమా చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు. లైకా ప్రొడక్షన్లో ఈ మూవీ నిర్మిస్తున్నారని, 2021లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హీరో మాధవన్ ఉన్న ఫోటోపై రతన్ టాటా అని రాసి ఉన్న ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఇటీవల మాధవన్, అనుష్క జంటగా నిశ్శబ్ధం మూవీ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క మాటలు రాని, వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా నటించారు.
Hey unfortunately it’s not true. It was just a wish at some fans will made the poster. No such project is even on the pipeline or being discussed. https://t.co/z6dZfvOQmO
— Ranganathan Madhavan (@ActorMadhavan) December 11, 2020