MAA: హై ఓల్టేజ్ క్రియేట్ చేస్తోన్న ‘మా’ ఎన్నికలు.. తారల హడావుడితో జామ్ అయిపోతోన్న ఫిల్మ్‌నగర్ జంక్షన్

|

Aug 21, 2021 | 8:28 PM

పట్టుమని వెయ్యి మంది సభ్యులు లేరు. ఇంకా పక్కా భవనమూ లేదు. కానీ 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మాత్రం హై ఓల్టేజ్ హీట్‌

MAA: హై ఓల్టేజ్ క్రియేట్ చేస్తోన్న మా ఎన్నికలు.. తారల హడావుడితో జామ్ అయిపోతోన్న ఫిల్మ్‌నగర్ జంక్షన్
Maa
Follow us on

Movie Artisits Association Elections: పట్టుమని వెయ్యి మంది సభ్యులు లేరు. ఇంకా పక్కా భవనమూ లేదు. కానీ ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మాత్రం హై ఓల్టేజ్ హీట్‌ రాజేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే హడావుడితో ఫిల్మ్‌నగర్ జంక్షన్ జామవుతోంది. మా అధ్యక్ష ఎన్నికల పోటీ జనరల్ ఎలక్షన్లను తలపించే రేంజ్‌లో ఉంది. మొత్తం ఐదుగురు పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్స్‌ మాత్రమే ఢీ అంటే ఢీ అంటున్నాయి. మంచు విష్ణు షాకుల మీద షాకులిస్తున్నారు. మా పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న మంచువారి పెద్దబ్బాయి.. మా ఫ్యామిలీకి ఎగ్జయిటింగ్‌ న్యూస్‌ అంటూ బాంబు పేల్చారు.

గత పాలకవర్గం సమయం ముగుస్తున్న నేఫథ్యంలో.. కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు జరగాల్సిఉంది. కాని ఇప్పటివరకు ‘మా’ అసోసియేషన్‌ నుంచి గాని.. అసోసియేషన్‌ పెద్దల నుంచి గాని ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ.. ప్రస్తుత పాలకవర్గానికి వ్యతిరేకంగా ప్రకాష్‌రాజ్‌ ఓ ప్యానల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులను ప్యానల్‌ ప్రకటించారు. మా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. ఇక ప్రకాష్‌రాజే తర్వాతి మా అధ్యక్షుడు అంటూ అంతా ప్రచారం జరిగింది. కాని ఉన్నట్లుండి సీన్‌లోకి మంచు విష్ణు ఎంటరై సమీకరణాలు మార్చేశారు. ఓ ప్రత్యేక భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ… తన హామీలు ఉత్తవి కావని నిరూపించేందుకు విష్ణు సంచలన ప్రకటన చేశారు. మా బిల్డింగ్‌ కోసం మూడు స్థలాలు చూశానన్నారు. వాటిలో ఏది బెస్టో అందరం కలిసి డిసైడ్‌ చేద్దామంటూ ఓ వీడియో ట్వీట్‌ చేశారు.

మా ఎన్నికలు మొత్తం బిల్డింగ్‌ చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మా అసోసియేషన్‌కు ఓ భారీ భవంతిని నిర్మిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. అలా పది పదిహేను ఏళ్లు గడిచిపోయాయి కాని.. హామీ మాత్రం నెరవేరలేదు. పాలకవర్గాలు మారినా.. అధ్యక్షులెవరూ ఈ హామీపై కదల్లేదు. అసలు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కి భవనమే అక్కర్లేదంటున్నారు బండ్ల గణేష్‌. భవనం లేకపోయినంత మాత్రానా ఇండస్ట్రీ ఏమీ ఆగిపోదు.. కానీ దాని కంటే ముందుగా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయన్నారు. 900 మంది సభ్యులున్న.. మాలో దాదాపు వంద మంది దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నారు. రెంటు కట్టేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారి కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలన్నారు బండ్ల. ప్రభుత్వాన్ని అడిగితే భూమి ఇవ్వదా? అందులో ఈ వంద మందికి ఇళ్లు కట్టించాలని.. దానికి మన హీరోలు కూడా ముందుకు వస్తారన్నారు బండ్ల గణేష్‌. ఇలా రోజుకో పరిణామానికి ‘మా’ ఎన్నికలు వేదికగా మారుతున్నాయి.

Read also:  Varla vs Jogi: జోగి రమేష్ ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాదు.. అంబేద్కర్‌పై దాడి కూడా : వర్ల