AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సునీల్‌కి షాకిచ్చిన బోయపాటి..!

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాలగూడ రవీంద్రారెడ్డి నిర్మిస్తున్నారు.

సునీల్‌కి షాకిచ్చిన బోయపాటి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 12, 2020 | 5:54 PM

Share

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాలగూడ రవీంద్రారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఆయన అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి సునీల్ పాత్రను తీసేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.

ఈ సినిమాలో సునీల్‌తో ఓ పాత్రను చేయించాలనుకున్న బోయపాటి.. అందుకోసం ఓ కామెడీ ఎపిసోడ్‌ని కూడా రాసుకున్నారట. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారట బోయపాటి. ఈ నేపథ్యంలో సునీల్ పాత్రను కట్‌ చేశారట దర్శకుడు. సీరియస్ డ్రామాగా సాగుతున్న ఈ సినిమాలో ఆ పాత్ర అనవసరమని భావించిన బోయపాటి.. ఆ పాత్రని తీసేశారట. దీంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి సునీల్‌ తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

అయితే కెరీర్‌ పరంగా సునీల్ అసలే కాస్త కష్టాల్లో ఉన్నారు. కమెడియన్‌గా దూసుకుపోతున్న సమయంలో హీరోగా మారిన సునీల్, పలు చిత్రాల్లో నటించారు. కానీ అందులో రెండు, మూడు మినహా మిగలినవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ కమెడియన్‌గా బిజీ అవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగైదు చిత్రాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు. కానీ అవేవీ ఆయన కెరీర్‌కి ఉపయోగపడలేదు. ఇలాంటి నేపథ్యంలో సునీల్‌కి ఇది పెద్ద షాక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: కొత్త అవతారంలో రకుల్.. ఫొటోలు వైరల్..!

Follow Us
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ