Chiranjeevi Next: కరోనా అనంతరం మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి ఫోకస్‌ను సినిమాలపైనే పెట్టినట్లుగా కనిపిస్తోంది. దీంతో పలువురు దర్శకులు చిరంజీవి దగ్గరికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ హైదరాబాద్ శివార్లలో వేసిన ఊరి సెట్ లో షూట్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగానే మెహర్ రమేష్‌తో మరో సినిమా చేస్తున్నారు. లూసిఫర్ రిమేక్ ఉండనే ఉంది. ఈ సంవత్సరం మెగాస్టార్ బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ చిరంజీవికి కథ వినిపించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కనుక తన కథను ఓకే చేస్తాడనే వెంకీ ఆశ పడుతున్నాడట. మరి చూడాలి వెంకీ కథ మెగాస్టార్ కి నచ్చుతుందో లేదో. కాగా చిరు వరుస సినిమాలు ఒప్పుకుంటున్న నేపథ్యంలో చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారట. ఇప్పటికే చిరుకు కొంతమంది లైన్స్ కూడా చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ రేసులో తమిళ డైరెక్టర్.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!