L2 Empuraan: ‘ఎల్2 ఎంపురాన్’ నిర్మాతపై ఈడీ దాడులు.. 1,000 కోట్ల కేసులో..
మోహన్ లాల్ నటించిన 'ఎల్2: ఎంపురాన్' సినిమా ఏదో ఒక కారణంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఓ వైపు ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నా, మరోవైపు వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ మూవీ నుంచి ఇప్పటికే చాలా సీన్లను తొలగించారు. తాజాగా న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చిత్ర నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ కు ఇది సీక్వెల్. పృథ్వీరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఉగాది కానుకగా (మార్చి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. అదే సమయంలో మోహన్ లాల్ సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘ ఎంపురాన్ ‘ చిత్రంలో హిందూ మతన్నా కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా చూపించారని విమర్శలు చేస్తున్నారు. అలాగే విలన్ పేరును భజరంగిగా పెట్టడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఈ కారణంగానే ఎంపురాన్ నుంచి వివాదాస్పద సన్నివేశాలను తొలగించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చిత్ర నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఇది సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. చెన్నై, కొచ్చిలోని గోపాలన్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. శ్రీ గోకులం చిట్స్ తో పాటు గోపాలన్ కు సంబంధించిన ఆసుపత్రులు, మీడియా, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్‌కు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది,
‘ఎల్ 2: ఎంపురాన్’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, సుభాస్కరన్ అలిరాజా, గోకులం గోపాలన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఆర్‌ఎస్‌ఎస్ సహా అనేక మితవాద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ దాడులు జరగడం తీవ్ర చర్చకు దారితీసింది.
The #ED raided the Chennai offices of Sree Gokulam Chits Fund part of foreign exchange violations probe.
Gokulam Gopalan (centre) is one of the producers of the L2 Empuraan, a film directed by Prithviraj Sukumaran (left) 👇🏻 pic.twitter.com/IRDb7j8FR9
— Dr.Jyoti S Patel 🇮🇳 (@DrJyoti_S_PATEL) April 4, 2025
కాగా ఎంపురాన్ సినిమాపై వస్తోన్న విమర్శలకు స్పందించిన మోహన్ లాల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. ఇక చిత్ర బృందం కూడా చాలా సన్నివేశాలను కట్ చేసింది. కొన్ని పాత్రల పేర్లను మార్చింది. అలాగే కొన్ని చోట్ల సంభాషణలు మ్యూట్ చేశారు. అలాగే కొన్ని చోట్ల నేపథ్య సంగీతాన్ని మార్చేసింది. మొత్తానికి సినిమాలో మొత్తం 24 మార్పులు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.