AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగొచ్చేసింది కానీ అసలు ట్విస్ట్ ఇదే..

తన కూతురికి ఇచ్చి వారం రోజుల్లో వివాహం జరిపించాల్సిన అల్లుడితో వెళ్లిపోయిన అత్త కథలో సూపర్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. బుధవారం స్వప్న, రాహుల్ పోలీసుల దగ్గర సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో తాను కాబోయే అల్లుడితో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో వివరించింది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అలాగే, తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral: అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగొచ్చేసింది కానీ అసలు ట్విస్ట్ ఇదే..
Sapna - Rahul Kumar
Ram Naramaneni
|

Updated on: Apr 17, 2025 | 12:12 PM

Share

పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన సప్న ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది. తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, నగలు తీసుకెళ్లలేదని, తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు.. తనను సప్న బెదిరించడంతోనే ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్‌లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని సప్న తనకు ఫోన్ చేసి చెప్పిందని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సప్నని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు.. తాను సిద్దంగానే ఉన్నట్టు తెలిపాడు.

అలీఘర్‌లోని దాదోన్‌కు చెందిన సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. ఆమెకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి నిశ్చియించారు. మరో 10 రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఏప్రిల్ 6, 2025న 40 ఏళ్ల స్వప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో పరారీ అయ్యింది. దీంతో, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
'ధురంధర్' సినిమా చూశారా? షారుఖ్‌ సమాధానమిదే..
'ధురంధర్' సినిమా చూశారా? షారుఖ్‌ సమాధానమిదే..
బాలకృష్ణ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత తోపు హీరోయిన్..
బాలకృష్ణ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత తోపు హీరోయిన్..
CRPF కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా IGగా IPS సంజుక్తా పరాశర్
CRPF కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా IGగా IPS సంజుక్తా పరాశర్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే