మహేష్ బాబు.. కొండారెడ్డి బురుజు.. ఎపిక్ కాంబో రిపీట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్ రాజు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ సరసన రష్మిక నటిస్తుండగా.. విజయ శాంతి, రావు రమేష్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ మూవీ చిత్రీకరణ కోసం […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:50 am, Mon, 23 September 19
మహేష్ బాబు.. కొండారెడ్డి బురుజు.. ఎపిక్ కాంబో రిపీట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్ రాజు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ సరసన రష్మిక నటిస్తుండగా.. విజయ శాంతి, రావు రమేష్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ మూవీ చిత్రీకరణ కోసం కర్నూల్‌లో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు సెట్టింగ్‌ను ఆర్ట్ డైరక్టర్ ఏఎస్ ప్రకాష్ ఫిలిం సిటీలో వేశారు. ఇక బురుజు దగ్గర మహేష్ బాబు ఉండగా.. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

‘‘16 సంవత్సరాల క్రితం ఈ కట్టడం(కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కట్టడం వద్ద మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు’’ అంటూ అనిల్ రావిపూడి కామెంట్ పెట్టాడు. కాగా మహేష్ బాబు కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో‘ ఒక్కడు’ ఒకటి. ఈ మూవీలో పలు సన్నివేశాలను కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద తెరకెక్కించారు. ఆ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు అదే కట్టడాన్ని మరోసారి మహేష్ కోసం రీ క్రియేట్ చేశారు. కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కుతోంది. ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.