Vishal: షూటింగ్‌లో ప్రమాదం.. మరోసారి తీవ్రంగా గాయపడ్డ యాక్షన్‌ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్‌

Vishal Injured: సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల కోసం ఎంతకైనా రిస్క్‌ చేసే హీరోల్లో విశాల్‌ కూడా ఒకరు. సినిమాల్లో పోరాట సన్నివేశాలు సహజంగా రావడానికి ఎలాంటి డూప్‌ లేకుండా నటిస్తుంటారాయన..

Vishal: షూటింగ్‌లో ప్రమాదం.. మరోసారి తీవ్రంగా గాయపడ్డ యాక్షన్‌ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్‌
Hero Vishal

Updated on: Aug 11, 2022 | 11:22 AM

Vishal Injured: సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల కోసం ఎంతకైనా రిస్క్‌ చేసే హీరోల్లో విశాల్‌ కూడా ఒకరు. సినిమాల్లో పోరాట సన్నివేశాలు సహజంగా రావడానికి ఎలాంటి డూప్‌ లేకుండా నటిస్తుంటారాయన. ఇవి సినిమాకు ప్లస్‌ అవుతాయని, అభిమానులను కూడా ఆకట్టుకుంటాయని ఈ యాక్షన్‌ హీరో నమ్మకం. అయితే ఇదే ఆయనకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. యాక్షన్‌ సీన్లలో నటించేక్రమంలో పలుమార్లు గాయాలబారిన పడుతున్నాడు. ఇటీవల లాఠీ సినిమా షూటింగ్‌ సమయంలో కూడా ప్రమాదానికి గురయ్యాడు. తాజాగా మరోసారి ఆయన గాయపడ్డాడు.

లాఠీ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయడంతో విశాల్‌ ప్రస్తుతం మార్క్‌ ఆంటోనీ మూవీతో బిజీగా ఉన్నాడు. గురువారం (ఆగస్టు11) ఉదయం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఈ కోలీవుడ్‌ హీరో భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో విశాల్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో మార్క్‌ ఆంటోనీ షూట్‌ని వెంటనే నిలిపివేశారు. గాయపడ్డ విశాల్‌కు ప్రథమ చికిత్స అందించారు. అయితే ఆ తర్వాత కూడా ఇబ్బందికరంగా ఉండడంతో షూటింగ్‌ నుంచి వెళ్లిపోయాడట విశాల్‌. కొద్ది రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. కాగా సోషల్‌మీడియా వేదికగా విశాల్‌ గాయం విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..