AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Weds Rambai : ఎంత పని చేశారు భయ్యా… హిట్టు సినిమాను వదిలేసుకున్నారే.. బ్లాక్ బస్టర్ మిసైన నలుగురు హీరోలు.. .

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నాడు అఖిల్ రాజ్. అయితే ఈ సినిమాను నలుగురు హీరోలు మిస్ చేసుకున్నారు. ఇంతకీ వారు ఎవరో తెలుసా..

Raju Weds Rambai : ఎంత పని చేశారు భయ్యా... హిట్టు సినిమాను వదిలేసుకున్నారే.. బ్లాక్ బస్టర్ మిసైన నలుగురు హీరోలు.. .
Raju Weds Rambai
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2026 | 2:47 PM

Share

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు శైలు కంపాటి ప్రయాణం ఎన్నో కష్టనష్టాలు, అడ్డంకులతో కూడుకున్నది. 2015లో సినీ ఇండస్ట్రీపై నమ్మకంతో హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు, 2017 నుంచి 2019 వరకు అత్యంత కఠినమైన కాలం ఎదురైంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక దశలో ఆయన సొంతూరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే, చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆయన తండ్రి అందించిన ప్రోత్సాహంతో శైలు తిరిగి ఇండస్ట్రీకి వచ్చారు. ప్రారంభంలో అవకాశాల కోసం పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను కలిసినా, అప్పట్లో అనుభవం లేకపోవడంతో అవకాశం దక్కలేదు. బతుకుదెరువు కోసం స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తూనే, ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణుని కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. సురేష్ బొబ్బిలి సహాయంతో వేణును కలిసి తన కథను వినిపించారు.

లాక్‌డౌన్ సమయంలో తీవ్ర నిరాశను చవిచూసినా, ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ద్వారా కూడబెట్టిన రూ. 30 వేలతో తన కథకు ఒక డెమో రీల్ తయారు చేసుకున్నారు. ఈ డెమో రీల్ చూసి వేణు అభినందించడంతో శైలులో ఆశ చిగురించింది. ఆపై పలువురు నిర్మాతలు, యువ హీరోల చుట్టూ తిరిగినా, రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్ కుదరలేదు. కొందరు కథలో మార్పులు కోరినా, తన విజన్ దెబ్బతింటుందని శైలు వారిని సున్నితంగా తిరస్కరించారు. ఎన్నో పరాజయాలు, నిరాశలను ఎదుర్కొన్న తర్వాత.. ఈ కథకు కొత్త నటీనటులైతేనే పూర్తి న్యాయం చేయగలరని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా కొత్తవారితో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకుంటూ చిన్న సినిమా స్థాయిని పెంచింది.

పెద్ద హీరోలతో సినిమా చేస్తే కమర్షియల్ హంగుల కోసం కథాసందర్భాన్ని మార్చాల్సి వస్తుందని, కానీ తన దగ్గర ఉన్న పల్లెటూరి నేటివిటీ, పచ్చిదనం చెడిపోకూడదని భావించారు. అందుకే రాజీపడే కంటే, కొత్త నటీనటులతోనే ఒక సరికొత్త లోకాన్ని తెరపైకి తీసుకురావాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఛాయ్ బిస్కెట్ అనురాగ్, శరత్ వంటి ప్రముఖులు కూడా కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించినా, తన ఒరిజినల్ విజన్‌పైనే నమ్మకం ఉంచారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

Follow Us