Anant Ambani : అంబానీ కొడుకా మజాకా.. అనంత్ అంబానీ ఫిట్‏నెస్ ట్రైనర్ జీతం తెలిస్తే మైండ్ బ్లాంకే..

|

Feb 24, 2024 | 9:16 PM

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‏తో జరగనుంది. జూలై 12న వీరి వివాహం ముంబైలో జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గుజరాత్‏లోని జామ్ నగర్‏లో మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాపారరంగానికి చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హజరుకానున్నారు. ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.

Anant Ambani : అంబానీ కొడుకా మజాకా.. అనంత్ అంబానీ ఫిట్‏నెస్ ట్రైనర్ జీతం తెలిస్తే మైండ్ బ్లాంకే..
Ananth Ambani
Follow us on

ప్రపంచ సంపన్నుల్లో ముఖేష్ అంబానీ ఒకరు.. అంతటి భారతీయ దిగ్గజ పారిశ్రామిక వేత్త.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇంట త్వరలోనే పెళ్లి భజాలు మోగనున్నాయి. ఈ ఏడాది ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‏తో జరగనుంది. జూలై 12న వీరి వివాహం ముంబైలో జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గుజరాత్‏లోని జామ్ నగర్‏లో మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాపారరంగానికి చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హజరుకానున్నారు. ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. గతేడాది వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో అనంత్ అంబానీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది.

అనంత్ అంబానీ బరువు తగ్గడం.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా బరువు పెరగడం గురించి చాలా చర్చలు జరిగాయి. కొన్ని నెలల్లోనే 108 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే అనంత్ అంత తొందరగా బరువు తగ్గడంలో ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్‏నెస్ ట్రైనర్ వినోద్ చన్నా కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు వినోద్ చన్నా ముకేశ్, నీతా అంబానీల పర్సనల్ ఫిట్‏నెస్ ట్రైనర్. ఆ తర్వాత అతడు వారి కుమారు అనంత్ అంబానీకి వ్యక్తిగత ఫిట్‏నెస్ ట్రైనర్ గా వర్క్ చేశాడు. కేవలం 18 నెలల్లోనే అనంత్ అంబానీ లుక్ మార్చేశాడు. కఠినమైన ఆహార నియంత్రణ, వ్యాయమాలతో అతడిని 108 కిలోల బరువు తగ్గించాడు. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ ఫిట్‏నెస్ ట్రైనర్ జీతం గురించి నెట్టింట అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

Ananth Ambani Fitness

బిజినెస్ ఇన్ సైడర్ ప్రకారం అతడు 12 సెషన్స్ కు సుమారు రూ.1.5 లక్షలు వసూలు చేస్తాడట. ఇతర నివేదికల ప్రకారం క్లయింట్ ఇంటిలోనే ఇచ్చే ఫిట్‏నెస్ పర్సనల్ ట్రైనింగ్ కోసం అతడు రూ. 3.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేస్తాడని సమాచారం. అనంత్ అంబానీకి శిక్షణ ఇవ్వడంతోపాటు.. నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్దన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్ వంటి అనేక మంది బాలీవుడ్ తారలకు ఫిట్‏నెస్ ట్రైనింగ్ అందించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.