Green India Challenge: మొక్కలు నాటిన రోజా, ఖుష్బూ.. ఎవరెవరికి సవాల్ విసిరారంటే..!

| Edited By:

Feb 29, 2020 | 5:54 PM

తెలంగాణ ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మొక్కలు నాటుతూ.. తమ సన్నిహితులకు సవాల్ విసురుతూ వస్తున్నారు.

Green India Challenge: మొక్కలు నాటిన రోజా, ఖుష్బూ.. ఎవరెవరికి సవాల్ విసిరారంటే..!
Follow us on

తెలంగాణ ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మొక్కలు నాటుతూ.. తమ సన్నిహితులకు సవాల్ విసురుతూ వస్తున్నారు. ఇక ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్యే రోజా, నటి ఖుష్బూలు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మొక్కలు నాటారు. హీరో అర్జున్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఖుష్బూ, రోజాతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా తన సహ నటులు మీనా, సుహాసినిలతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్‌కు ఖుష్బూ చాలెంజ్‌ను విసిరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మన పిల్లలు మనకు డిజిటల్ నేర్పిస్తుంటే.. మనం పర్యావరణ సంరక్షణ నేర్పించాలని, తన పిల్లలకు తాను అదే నేర్పిస్తున్నానని అన్నారు. ఇక రోజా మాట్లాడుతూ.. మన పిల్లలకు ఆస్తుల కంటే పచ్చదనాన్నే ఆస్తిగా అందించాలని సూచించారు.