KGF: క్యాన్సర్‌తో బాధపడుతోన్న కేజీఎఫ్‌ నటుడు.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోన్న ఖాసీం చాచా

|

Aug 26, 2022 | 5:49 AM

Harish Roy: కన్నడ సూపర్‌ స్టార్‌ యశ్‌ (Yash) హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ (KGF) సిరీస్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు చూసిన వారికి అందులోని ఖాసీం చాచా క్యారెక్టర్‌ గుర్తుండే ఉంటుంది.

KGF: క్యాన్సర్‌తో బాధపడుతోన్న కేజీఎఫ్‌ నటుడు.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోన్న ఖాసీం చాచా
Harish Roy
Follow us on

Harish Roy: కన్నడ సూపర్‌ స్టార్‌ యశ్‌ (Yash) హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ (KGF) సిరీస్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు చూసిన వారికి అందులోని ఖాసీం చాచా క్యారెక్టర్‌ గుర్తుండే ఉంటుంది. అనాథ బాలుడైన రాకీని చేరదీసి చివరి వరకు అతనికి తోడుగా నిలుస్తాడాయన. ‘బోల్ రే క్యా చాహీయే తేరేకో’ అంటూ ఓ ముస్లిం వృద్ధుడి పాత్రలో కనిపించిన ఖాసిం చాచా అసలు పేరు హరీశ్‌ రాయ్‌. తనదైన నటనతో మెప్పించిన ఈ సీనియర్‌ నటుడు ఇప్పుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను కిడ్వాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ఇప్పటికే అతడి ఊపిరితిత్తులకు సర్జరీ కాగా క్యాన్సర్ పూర్తిగా నయం కావాలంటే మరింత చికిత్స అవసరముందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిందని.. ఇంకా మిగిలి ఉన్న చికిత్స కోసం ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని హరీష్ రాయ్ వేడుకుంటున్నాడు.

ఆ విషయం చెబితే అవకాశమివ్వరని..

కాగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టారు హరీశ్‌ రాయ్‌. ఇలా ఎందుకు చేశారని ఆయనను అడగ్గా.. ‘నాకు మొదట థైరాయిడ్ సమస్య ఉందనుకున్నాను. పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్​గా నిర్ధారణ అయ్యింది. నాకు క్యాన్సర్‌ ఉందని తెలిస్తే ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు ఇవ్వరని భయపడ్డాను. అందుకే ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. నాకు డబ్బు ఎంతో అవసరం. అయితే క్యాన్సర్‌ తో బాధపడుతున్న నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి సినిమా వాళ్లు కూడా నన్ను దూరం పెడతారన్న భయంతోనే అలా చేశాను’ అని కన్నీటి పర్యంతమయ్యాడు హరీశ్‌ రాయ్‌. కాగా కేజీఎఫ్‌ నటుడి దుస్థితి గురించి తెలుసుకున్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఆయనకు తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. మరి హరీశ్‌ త్వరలోనే కోలుకోవాలని మళ్లీ ఆయన సినిమాల్లో నటించాలని అందరూ కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..