
టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ శాఖ నజర్ పెంచింది. మైత్రి మూవీకి ముంబైతో ఉన్న లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముంబైకి చెందిన ఓ ఫైనాన్సర్ నుంచి డబ్బు తీసుకొని బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సిద్ధమైనట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా ఇప్పటికే అడ్వాన్స్‌గా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
విచారణలో భాగంగా రెండు రోజులుగా ఫైనాన్షర్లు, నిర్మాతల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా డబ్బులతో హైదరాబాద్ శివారులో భూముల కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల దాడులు కొనసాగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 25లో ఉన్న సినిమా సంస్థలో గురువారం ఉదయం నుంచే తనిఖీలు చేపట్టారు. సినిమాలకు పెట్టుబడి ఎలా వచ్చిందన్న దానిపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థలో ఓ ఎమ్మెల్యేతోపాటు, మైనింగ్ వ్యాపారి పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి ఈ విచారణ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..