Drugs Case: డ్రగ్స్‌ విక్రయిస్తూ అడ్డంగా పట్టుబడ్డ నటి.. పరారీలో స్నేహితుడు..

|

Mar 22, 2023 | 11:07 AM

మాదక ద్రవ్యాల వినియోగం చలన చిత్ర పరిశ్రమలో వరుస ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు డ్రగ్స్‌ వివాదం తెరమీదకు రావడంతో హాట్‌టాపిక్‌గా మారింది. చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటిని డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్టు..

Drugs Case: డ్రగ్స్‌ విక్రయిస్తూ అడ్డంగా పట్టుబడ్డ నటి.. పరారీలో స్నేహితుడు..
Drugs Case
Follow us on

మాదక ద్రవ్యాల వినియోగం చలన చిత్ర పరిశ్రమలో వరుస ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు డ్రగ్స్‌ వివాదం తెరమీదకు రావడంతో హాట్‌టాపిక్‌గా మారింది. చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటిని డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇలాంటి అడ్డదారిలో నటి డబ్బు సంపాదిస్తున్నట్లు సమాచారం. కేరళ రాష్ట్రం కొచ్చిలోని త్రిక్కక్కరాలోని ఉనిచిర థోపిల్ జంక్షన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్నారు మలయాళం నటి అంజుకృష్ణ. బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి తన అపార్ట్‌మెంట్‌లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిటీ పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో యోధవ్ స్క్వాడ్ నటి అంజు కృష్ణ ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించగా 56 గ్రాముల సింథటిక్ డ్రగ్స్‌ ఎండీఎంఏను గుర్తించారు. నటితో కలిసి అదే అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న కాసర్‌గోడ్‌కు చెందిన షమీర్‌ పోలీసులను చూసి పరారయ్యాడు. ఈ ఘటనలో నటి అంజు కృష్ణను పోలీలసులు అరెస్టు చేసి, 56 గ్రాముల సింథటిక్ డ్రగ్స్‌ ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

కాగా థియేటర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న నటి అంజుకృష్ణకు మూడేళ్ల క్రితం కాసర్‌గోడ్‌కు చెందిన షామీర్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు దంపతులమని చెప్పి ఉనిచ్చిరలోని ఇంటిని నెల రోజుల క్రితం అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అవకాలులేకపోవడంతో బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి కొచ్చిలో విక్రయించడం ప్రారంభించారు. అధిక సంపాదన కళ్ల జూసిన ఈ జంట యథేచ్చగా డ్రగ్స్ విక్రయిస్తుండటంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల దాడిలో వీరి గుట్టురట్టయ్యింది. పరారీలో ఉన్న షామీర్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.