Akshara Pre Release Event: చీఫ్ గెస్ట్ గా కల్వకుంట్ల కవిత, గ్రాండ్ గా ‘అక్షర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా 'అక్షర'. ఇటీవలే షూటింగ్..

Akshara Pre Release Event: చీఫ్ గెస్ట్ గా కల్వకుంట్ల కవిత, గ్రాండ్ గా అక్షర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

Edited By: Ram Naramaneni

Updated on: Feb 23, 2021 | 7:34 PM

సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘అక్షర’. ఇటీవలే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

సినిమా కాన్సెప్ట్‌ నచ్చడంతో యూనిట్‌ను కవిత ప్రశంసించడంతో పాటు ఈ నెల 23న జరుగనున్న చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకకు హాజరవుతానని ఇప్పటికే కవిత ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈవెంట్ లో స్టార్ అట్రాక్షన్ అయ్యారు. లేడీ ఓరియెంటెడ్ జానర్ లో వస్తోన్న ఈ సినిమాలో నందితా శ్వేత లీడ్ రోల్ చేస్తుండగా, షకలక శంకర్ తదితరులు ముఖ్యతారాగణంగా ఉన్నారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఈ దిగువున స్పెషల్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

Read also :

దూసుకోస్తోన్న కరోనా సెకండ్ వేవ్, 16 రాష్ట్రాల్లో డేంజర్‌ బెల్స్‌.. కరీంనగర్‌ 36 ప్లస్‌.. పశ్చిమగోదావరిలోనూ అలజడి