బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతను ఎక్కడ కనిపించినా ఫొటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతుంటారు. ఇతనికి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఇటీవల ఇద్దరు అమ్మాయిలు కార్తీక్ ఇంటి దగ్గరకు వచ్చి ‘కార్తీక్ బయటకు రావాలి’ అని రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ ఈ యంగ్ హీరోకు బోలెడు ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తుంది. అలా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్ వీడియో షేర్ చేశాడీ హ్యాండ్సమ్ హీరో. ఇందులో అర్జున్ పాతక్ అనే అమ్మాయి కార్తీక్ నటించిన ధమాకా సినిమాలోని డైలాగులను అద్భుతంగా చెప్పింది. దీనికి కార్తీ్‌క్ కూడా ఇంప్రెస్ అయ్యాడు. డైలాగ్ చెప్పడం పూర్తవగానే ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ‘సో క్యూట్’, ‘బ్యూటీఫుల్ వీడియో’ అంటూ కామెంట్లు కురిపించారు. అయితే ఒక అమ్మాయి మాత్రం ‘రూ.20 కోట్లిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని కార్తీక్‌ను అడిగింది. దీనికి ఆర్యన్ బదులిస్తూ ‘సరే, ఎప్పుడు చేసుకుందాం?’ అని రిప్లై ఇవ్వగా ‘ లేటెందుకు ఇప్పుడే వచ్చేసేయ్.. పెళ్లి చేసుకుందాం’ అని హీరోకు బదులిచ్చింది.
వేలం పాట పాడుదామా?
ఇది చూసిన మరికొందరు అమ్మాయిలు ‘నేనూ 20 కోట్ల రూపాయలు ఇస్తాను , నన్ను పెళ్లి చేసుకో’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో కార్తీక్ ఆర్యన్ ‘ అయితే వేలంపాట వేద్దాం’ అని సరదాగా చమత్కరించాడు. కాగా ఇటీవల ధమాకా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కార్తీక్. ప్రస్తుతం అతను ‘అల..వైకుంఠపురం’ రీమేక్ షెహజాదాలో నటిస్తున్నాడు. ఇది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే భూల్ భులాయా 2 ఫ్రెడ్డీ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారాడు కార్తీక్.