Karthika Deepam: నువ్వు నా విషయంలో యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ తట్టుకోలేవు అంటూ కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత

|

Jun 18, 2021 | 12:53 PM

Karthika Deepam:కార్తీక దీపం తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సీరియల్ , గత మూడేళ్లకు పైగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో సాగుతూ..

Karthika Deepam: నువ్వు నా విషయంలో యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ తట్టుకోలేవు అంటూ కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత
Karthika Deepam
Follow us on

Karthika Deepam:కార్తీక దీపం తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సీరియల్ , గత మూడేళ్లకు పైగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. మోనిత కార్తీక్ ను దక్కించుకోవడానికి చేసే ప్రయత్నంలో మళ్ళీ దీప కార్తీక్ ల మధ్య దూరం ఏర్పడింది.. కార్తీక్ .. మోనిత ప్లాన్ ను ఎలా ఎదుర్కొంటాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో ఈరోజు సీరియల్ హైలెట్స్ ను చూద్దాం.

తనను పెళ్లి చేసుకుని దీపలా భార్య స్థానాన్ని ఇవ్వమని మోనిత కార్తీక్ ని డిమాండ్ చేస్తుంది. నీ అనుమానం అభిమానంగా మారితే నేను ఏమి చెయ్యాలి.. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానే నా పై నీకు ఎందుకు ప్రేమ కలగడం లేదు జరిగిన దానికి కనీసం జాలి అయినా చూపించు కార్తీక్ .. అంతకు మించి నేను ఏమీ కోరుకోవడం లేదు.. నీ ప్రమేయం ఉన్నా లేకున్నా జరిగిన దానికి నాకు న్యాయం చేయమంటున్న చూడు కార్తీక్ త్వరగా నువ్వు నిర్ణయం తీసుకోకపోతే నేను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది అని ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిస్తుంది కార్తీక్ ని మోనిత. తర్వాత నీ ఇష్టం.. బాగా ఆలోచించుకుని చెప్పు అంటుంది.

దీప తో హిమ , శౌర్య మాట్లాడుతూ.. ఇందాక నాన్న గోడమీద గీత భవిష్యత్ అన్నాడు.. నీకు అర్ధమైతే మాకు చెప్పమ్మా అని అడుగుతారు.. ప్రశ్నలు వేస్తుంటే విసుక్కోవడానికి అయినా నోరు విప్పేదానివి.. ఇప్పుడు ఏమిటి అసలు మాట్లాడం లేదు.. అని దీపని శౌర్య, హిమ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు.

అందరూ నీకు సపోర్ట్ .. నాన్నకూడా ఏమీ అనడం లేదు.. ఏమిటి ప్రాబ్లెమ్. అమ్మ చెప్పదు డాడీ మాట్లారు నువ్వే అదేదో కనిపెట్టు.. అంటే హిమ.. నేను అమ్మ చెప్పక పోయినా నాన్న ఎవరో తెలుసుకున్నా వాటితో పోలిస్తే ఇదేమీ పెద్ద విషయం కాదు.. వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా అయ్యారో ఈజీగా కనిపెడతా నువ్వు రా అంటూ హిమనీ తీసుకుని వెళ్తుంది శౌర్య.

ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాను.. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నా.. అంటూ ఇప్పుడు రేపు నిజం తెలిస్తే.. నాన్న మీద అసహ్యం పడితే.. అమ్మకి నాన్న అన్యాయం చేసారని తెలిస్తే.. రేపు జీవితంలో క్షమించగలరా లేదు క్షమించలేరు.. అంటూ ఆలోచిస్తుంది.

తల్లి దగ్గరకు వచ్చి కార్తీక్ కూర్చుని ఉంటాడు.. మమ్మీ నాకు సలహా ఇవ్వమని నీదగ్గరకు వచ్చా .. ఏమీ చెప్పడం లేదు అని అంటాడు. తల్లిని సాయం చేసి ఒడ్డుకు చేర్చు.. మమ్మీ .. మోనిత ఇప్పుడు నీళ్లలో ఉన్న మొసలి.. అది ఇప్పుడు చాలా శక్తివంతురాలు.. దానిని అంత బలవంతురాలుని చేసింది నువ్వు.. దాని తప్పు ఏమీ లేకుండా నువ్వు చేయని తప్పుకు పదేళ్లు శిక్ష అనుభవించింది. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు కూడా అదే శిక్ష అనుభవించాలే.. నాకు న్యాయం చేయమని మోనిత అడిగింది.. కానీ ఏ తప్పు చేయని నా కోడలు అన్యాయం మైపోవాలా అంటూ కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. తీరం ఏమిటో గమ్యం ఏమిటో నాకు తెలియడం లేదు అంటూ కార్తీక్ దిగులుగా మాట్లాడతాడు.
నాకు దారి చూపించు మమ్మీ.. నేను దీపని చేరుకుని నా కాపురాన్ని చక్కదిద్దుకుంటా అంటాడు.. ఈ సమస్యకు పరిష్కారం చూపించేది ఒక్క మోనితనే .. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కార్తీక్ కు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలి అంటుంది సౌందర్య.. అది జరిగే పనేనా అని ప్రశ్నిస్తుంది. నిన్ను నీళ్లలో ఉన్న ముసలి నిన్ను మింగేయడం కాయం.. తప్పు చేశావు శిక్ష తప్పదు.. ఆ శిక్ష జీవితకాలం అనేది కాలమే చెప్పాలి.. నన్ను నమ్మండి డాక్టర్ బాబు అని దీప అన్నప్పుడు ఒక్క క్షణం అలోచించి ఉంటె.. ఈరోజు నీ పరిష్టితి ఇలా ఉండేదా చెప్పు అని సౌందర్య కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. నీ భార్య పిలలల్తో కాపురం చేసుకుంటూ హాయిగా మహరాజులా ఉండేవాడివి..

దీప నాతొ మాట్లాడడం లేదు అంటున్నావు. నా తప్పు లేదు అన్నా దీపతో నువ్వు 10ఏళ్ళు మాట్లాడలేదు.. మోనిత విషయంలో నా తప్పు లేదు అని గట్టిగా అనలేకపోతున్న నీతో దీప ఎందుకు మాట్లాడారా నువ్వు మగదివానా పురుష అహంకారామా .. అసలు ఇప్పుడు దానికి భర్త అన్న మమకారమే చచ్చిపోయింది. నువ్వే చంపేశావు అంటుంది
అమ్మ వంట ఏమిటి చేస్తున్నావు. బెండకాయ అంటుంది.. ఇంతకు ముందు నాన్న వస్తే రకరకాల వంటలు చేసేదానివి.. ఇప్పుడు కనీసం ఆమ్లెట్ కూడా వేయడమే లేదు ఎందుకు నాన్న అంత పెద్ద తప్పు ఏమిట చేశావు.. ఇంతకు ముందు డాడీ నీ మీద కోపంగా ఉండేవాడు ఇప్పుడు నువ్వు కోపం చూపిస్తన్నావు కదా అంటుంది హిమ. ఇంతలో కార్తీక్ పిల్లలకు పండ్లు తీసుకొస్తాడు.. పిల్లలు సంతోష పడతారు.. ఐ లవ్ యు డాడీ అంటుంది హిమ. మర్నాడు దీప కార్తీక్ కు కాఫీ తీసుకొచ్చి డాక్టర్ బాబు అంటూ నిద్రలేపుతుంది..

Also Read: రతన్ టాటా సాయంతో 150 కోట్ల టర్నోవర్ స్థాయికి..ఓ అంధుడి సక్సెస్ స్టోరీ