Chetan Chandra:ప్రముఖ నటుడిపై దుండగుల దాడి.. తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా.. వీడియో షేర్ చేసిన చేతన్

|

May 13, 2024 | 7:30 PM

పలు కన్నడ సినిమాల్లో నటించిన నటుడు చేతన్ చంద్రపై దాడి జరిగింది. సోమవారం ( మే 13) బెంగళూరులోని కగ్గలిపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చేతన్ చంద్ర కారును అడ్డుకుని దాదాపు 20 మంది వ్యక్తులు దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియోను, వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు చేతన్ చంద్ర.

Chetan Chandra:ప్రముఖ నటుడిపై దుండగుల దాడి.. తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా.. వీడియో షేర్ చేసిన చేతన్
Kannada Actor Chetan Chandra
Follow us on

పలు కన్నడ సినిమాల్లో నటించిన నటుడు చేతన్ చంద్రపై దాడి జరిగింది. సోమవారం ( మే 13) బెంగళూరులోని కగ్గలిపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చేతన్ చంద్ర కారును అడ్డుకుని దాదాపు 20 మంది వ్యక్తులు దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియోను, వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు చేతన్ చంద్ర. దుండగుల దాడి ఘటనలో చేతన్ చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై నటుడు కగ్గలిపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లిని గుడికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా చేతన్ చంద్రపై దుండగులు దాడి చేశారు. అతని కారును కూడా ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఎలా జరిగిందో చేతన్ చంద్ర ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సమాచారం ఇచ్చారు. “ఇది నా జీవితంలో అత్యంత దారుణ అనుభవం. నాకు న్యాయం జరగాలి’ అని చేతన్ చంద్ర కోరాడు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స పొందుతున్న సమయంలో చేతన్ చంద్ర ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వచ్చి దాడి గురించి వివరించాడు.

‘ఈరోజు ఓ చేదు సంఘటనలో చిక్కుకున్నాను. దుండగులు నా కారును ఢీకొట్టారు. తాగి వచ్చి నా కారును అడ్డుకున్నారు. మొత్తం 20 మంది కలిసి నన్ను కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఉంది. కగ్గలిపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రథమ చికిత్స చేయించుకోవడానికి వచ్చాను. ఇప్పుడు మళ్లీ వచ్చి కారును ధ్వంసం చేశారు. వారు చాలా దారుణంగా ప్రవర్తించారు’ అని చేతన్ చంద్ర వాపోయాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

 పోలీసుల అదుపులో నిందితులు..

కాగా నటుడిపై హత్యాయత్నం చేశారన్న అభియోగంపై కిరణ్, హరీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు . ఈ కేసును కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌ విచారిస్తోంది. దాడికి గురైన చేతన్ చంద్ర ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతేకాకుండా, దాడి ఘటనకు సంబంధించి చేతన్ చంద్రపై కౌంటర్ ఫిర్యాదు కూడా దాఖలైంది. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ భార్య ఐశ్వర్య చేతన్‌పై కౌంటర్‌ ఫిర్యాదు చేసింది. తనపై, తన భర్త కిరణ్‌పై నటుడు దాడి చేశారని ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐశ్వర్య కగ్గలిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చేతన్ చంద్ర తో పాటు మరో ఇద్దరిపై ఐపిసి సెక్షన్ 323, 354, 34 కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.