Kangana Ranaut: ఆ ఒక్క కారణంతో రూ.40 కోట్లు కోల్పోయాను.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడి

|

May 17, 2023 | 6:48 PM

కంగనా రనౌత్.. ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కంగనా.. తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో యాక్ట్ చేసింది.

Kangana Ranaut: ఆ ఒక్క కారణంతో రూ.40 కోట్లు కోల్పోయాను.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడి
Kangana Ranaut 9 1[1]
Follow us on

కంగనా రనౌత్.. ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కంగనా.. తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో యాక్ట్ చేసింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల తాను 20-25 యాడ్స్‌లో అవకాశాన్ని కోల్పోయినట్లు తెలిపారు. కొందరు రాత్రికి రాత్రే ఒప్పందాలను రద్దు చేసుకున్నారని.. వీటి ద్వారా ఏడాదికి రూ.30-40 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు తాను స్వేచ్ఛ జీవినని.. తాను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. తాను ఆర్థికంగా నష్టపోయినా.. భారతదేశ సంస్కృతి, సమగ్రతను వ్యతిరేకించే బహుళజాతి సంస్థల అధినేతలపై తాను కచ్చితంగా మాట్లాడతానన్నారు.

చెప్పాలన్నది ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ను అభినందించకుండా ఉండలేనని కంగనా కొనియాడారు.  ప్రతి ఒక్కరూ తమ బలహీనతలను ప్రదర్శిస్తారు.. కనీసం ధనవంతులైనా డబ్బు గురించి ఆలోచించకూడదని కంగనా పేర్కొన్నారు. తాను ఏం చెప్పాలనుకుంటున్నానో అదే చెబుతాను. ఒకవేళ దాని వల్ల డబ్బు కోల్పోతే అలాగే జరగనీయండి అంటూ ఎలాన్ మస్క్ కామెంట్స్ నేపథ్యంలో ఆయన్ను ప్రశంసిస్తూ కంగనా ఈ ఇన్‌స్టా పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాలు చదవండి..