Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తోంది. తన కుమారుడు నీల్ కిచ్లూ (Neil Kitchlu) తో అమ్మతనంలోని ఆనందాన్ని ఎంజాయ్ చేస్తోంది. తల్లిగా ప్రమోషన్ పొందిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ తన పిల్లాడి ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. అయితే తన ముద్దుల కుమారుడి ముఖం మాత్రం ఇప్పటివరకు రివీల్ చేయలేదు. తాజాగా ఈ బ్యూటీ దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) తీసిన బాహుబలి సినిమాను గుర్తుచేసింది. ప్రేక్షకులను గూస్‌బంప్స్ తెప్పించిన బాహుబలి కాలుని తీసి కట్టప్ప తన తలపై పెట్టుకునే సీన్‌ను అద్భుతంగా రీక్రియేట్ చేసింది.
తన ముద్దుల తనయుడి కాలిని తన తలపై పెట్టుకున్న ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది కాజల్. దీనికి ‘ఎస్‌ఎస్ రాజమౌళి సార్. ఇది నీల్, నా డెడికేషన్. అందరిలా మేం కూడా ఎలా ఇన్‌స్పైర్ కాకుండా ఉంటాం’ అని క్యాప్షన్ ఇచ్చింది. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలను ఈ పోస్టుకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది కాజల్. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. కాగా అమ్మతనం కారణంగా చాలా రోజులకు సిల్వర్ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న చందమామ మళ్లీ హీరోయిన్‌గా బిజీ కానుంది. కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్‌లోకి త్వరలోనే జాయిన్ కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..