రోహిత్ ఆటా? ఐ లైక్ ఇట్: కాజల్ అగర్వాల్

అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్.. టీమిండియా వైస్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ అంటే ఒకప్పుడు తనకు క్రష్‌ ఉండేదని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘మీకు ఏ స్పోర్ట్స్‌ పర్సన్‌ అంటే ఇష్టం?’ అని అడిగిన ప్రశ్నకు కాజల్‌ ఈవిధంగా బదులిచ్చారు. రోహిత్‌కు తాను వీరాభిమానినని.. ఆయన ఆడే మ్యాచ్‌లను ఖచ్చితంగా చూస్తానని కాజల్ తెలిపారు. ‘నాకు రోహిత్‌ శర్మ అంటే ఒకప్పుడు క్రష్‌ ఉండేది. నేను అతడికి వీరాభిమానిని. రోహిత్‌ […]

రోహిత్ ఆటా? ఐ లైక్ ఇట్: కాజల్ అగర్వాల్

Edited By:

Updated on: Apr 30, 2019 | 4:57 PM

అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్.. టీమిండియా వైస్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ అంటే ఒకప్పుడు తనకు క్రష్‌ ఉండేదని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘మీకు ఏ స్పోర్ట్స్‌ పర్సన్‌ అంటే ఇష్టం?’ అని అడిగిన ప్రశ్నకు కాజల్‌ ఈవిధంగా బదులిచ్చారు. రోహిత్‌కు తాను వీరాభిమానినని.. ఆయన ఆడే మ్యాచ్‌లను ఖచ్చితంగా చూస్తానని కాజల్ తెలిపారు.

‘నాకు రోహిత్‌ శర్మ అంటే ఒకప్పుడు క్రష్‌ ఉండేది. నేను అతడికి వీరాభిమానిని. రోహిత్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. మైదానంలో రోహిత్ ఆటతీరు చూసి ఎంతో సంబరపడిపోయేదాన్ని. నేటికీ రోహిత్ ఆడే మ్యాచ్‌లను అస్సలు మిస్సవను’ అని కాజల్ చెప్పుకొచ్చారు.

తనదైన ఆటతీరుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రోహిత్ శర్మ.. మంగళవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. అభిమానులు రోహిత్‌ను ముద్దుగా ‘హిట్‌మ్యాన్‌’ అని పిలుచుకుంటారు. 32వ వడిలో అడిగుపెట్టిన రోహిత్‌కు పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.