AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా’ సభ్యులందరికీ ఇక పండగే.. నరేష్ ప్యానల్ వరాలు!

గతంలో కన్నా ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ మధ్య హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ఇరు ప్యానల్స్ అభ్యర్థుల మధ్య మాటలు యుద్ధం.. వివాదాలు పెరుగుతూ వచ్చాయి. మరోవైపు నరేష్ ప్యానల్ సభ్యుల ప్రమాణ స్వీకారం విషయంలో కూడా పెద్ద రగడే జరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా మా నూతన కార్యవర్గం తొలి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ మీటింగ్‌కు అధ్యక్షుడు నరేశ్.. […]

'మా' సభ్యులందరికీ ఇక పండగే.. నరేష్ ప్యానల్ వరాలు!
Ravi Kiran
|

Updated on: Apr 30, 2019 | 5:11 PM

Share

గతంలో కన్నా ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ మధ్య హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ఇరు ప్యానల్స్ అభ్యర్థుల మధ్య మాటలు యుద్ధం.. వివాదాలు పెరుగుతూ వచ్చాయి. మరోవైపు నరేష్ ప్యానల్ సభ్యుల ప్రమాణ స్వీకారం విషయంలో కూడా పెద్ద రగడే జరిగింది.

ఇదిలా ఉండగా.. తాజాగా మా నూతన కార్యవర్గం తొలి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ మీటింగ్‌కు అధ్యక్షుడు నరేశ్.. జనరల్ సెక్రటరీ జీవిత, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు సమావేశమయ్యారు. రానున్న రెండేళ్లకు వారు తీసుకోబోయే కీలక నిర్ణయాల్ని వెల్లడించారు.

అవి..

  • ‘మా’లో సభ్వత్వం తీసుకున్న ఆర్టిస్ట్స్ తమ సమస్యలను తెలిపేందుకు హెల్ప్ లైన్  9502030405కి సంప్రదించాలి.
  • పింఛను తీసుకునే సభ్యులకు ఈ ఏడాది నుంచి పెంచిన 6 వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తాం.
  • రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మా సభ్యులకూ వర్తింపజేసేలా ఓ నిర్ణయం తీసుకుంటాం.
  • కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికీ రెండు రకాల పద్ధతులను ప్రవేశ పెడుతున్నాం.
  • (1) రూ. 25 వేలు చెల్లించిన నూతన సభ్యునికి గోల్డ్ కార్డు ఇస్తాం. దీని కాలపరిమితి రెండేళ్లు. ఈ రెండేళ్లలో మిగతా రూ.75 వేలు చెల్లిస్తే.. వారు జీవితకాల సభ్యత్వ కార్డు పొందుతారు. శాశ్వత సభ్యునిగా గుర్తింపు పొందనంత వరకు ‘మా’ తరపున ఎలాంటి సౌకర్యాలు వీరికి వర్తించవు.
  • (2)రెండో పద్ధతిలో రూ.90 వేలు చెల్లించిన వారికి రూ.10 వేల రాయితీతో పాటు శాశ్వత సభ్యత్వ కార్డు అందజేస్తాం. ఈ అవకాశం 100 రోజులు మాత్రమే ఉంటుంది.
  • మా సభ్యులందరికీ ఈ ఏడాది నుంచి ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను మూడు లక్షలకు పెంచుతున్నాం.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..