AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జున సరసన కాజల్.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్.. త్వరలోనే షూటింగ్‏లోకి చందమామ…

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత జోరు పెంచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో

నాగార్జున సరసన కాజల్.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్.. త్వరలోనే షూటింగ్‏లోకి చందమామ...
Kajal Agarwal
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2021 | 11:54 AM

Share

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత జోరు పెంచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తొంది. అంతేకాకుండా.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న మోసగాళ్లు సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్రయూనిట్ ప్రకటించింది.

నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ సరసన కాజల్ నటించబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. అఫిషీయల్‏గా ప్రకటించింది చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ గోవాలో జరుగుతుంది. గోవా షెడ్యూల్ పూర్తైన త‌ర్వాత మిగిలిన చిత్రీక‌రణ కోసం నాగ్ టీం హైద‌రాబాద్‌కు రానుంది. మార్చి 31 నుంచి ఈ సినిమా చిత్రీకరణంలో కాజల్ పాల్గొననుంది. ఇందులో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌, మేనకోడలి పాత్రలో మలయాళీ నటి అనిఖ నటిస్తోంది. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తిచేసుకున్నాడు. ఇందులో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ‘హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ సినిమాను తొలుత ఓటీటీ వేదికగా విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, థియేటర్లు మళ్లీ ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్‌ తమ ఆలోచనను మార్చుకుంది. అటు కాజల్ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ రెండు సినిమాలకు ఓకే చెప్పిందట. అంతేకాకుండా.. ఈ టీవి షోకు కూడా హోస్ట్ గా చేయనున్నట్లుగా సమాచారం.

Also Read:

విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరోయిన్.. సేమ్ టూ సేమ్ బ్లాక్ వాటర్.. లీటర్ రేట్ ఎంతో తెలుసా..

సౌందర్య ఎక్స్‏పోజింగ్ అందుకే చేయలేదట.. అసలు విషయాన్ని బయటపెట్టిన సీనియర్ హీరోయిన్..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ