Jon Landau: సినీ పరిశ్రమలో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ నిర్మాత క‌న్నుమూత! సినీ దిగ్గజాల సంతాపం

|

Jul 07, 2024 | 5:51 PM

హాలీవుడ్‌లో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ ప్రోడ్యూస‌ర్ జాన్ లాండౌ (63) మృతి చెందారు. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కో చైర్‌ అయిన అలాన్‌ బెర్గ్‌మాన్‌ శనివారంఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఆస్కార్‌ అవార్డులను కైవసం చేసుకున్న ‘టైటానిక్’, ‘అవతార్' వంటి ఎన్నో చిత్రాల నిర్మాత‌గా హాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన లాండౌ మృతిప‌ట్ల దిగ్గజ‌..

Jon Landau: సినీ పరిశ్రమలో విషాదం.. ‘టైటానిక్’, అవతార్ నిర్మాత క‌న్నుమూత! సినీ దిగ్గజాల సంతాపం
Titanic And Avatar Producer Jon Landau
Follow us on

హాలీవుడ్‌లో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ ప్రోడ్యూస‌ర్ జాన్ లాండౌ (63) మృతి చెందారు. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కో చైర్‌ అయిన అలాన్‌ బెర్గ్‌మాన్‌ శనివారంఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఆస్కార్‌ అవార్డులను కైవసం చేసుకున్న ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి ఎన్నో చిత్రాల నిర్మాత‌గా హాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన లాండౌ మృతిప‌ట్ల దిగ్గజ‌ ద‌ర్శకుడు జేమ్స్ కామెరాన్, సామ్ వ‌ర్తింగ్స్‌ట‌న్ వంటి త‌దిత‌రులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జోన్ లాండౌ నిర్మాణంలో 1997లో తెరకెక్కిన ‘టైటానిక్‌’తో పెను సంచలనం సృష్టించాడు. అప్పట్లోనే 200 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ మువీని తెరకెక్కించాడు. ఈ మువీ ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇంత భారీ మొత్తం వసూలు చేసిన ఏకైక చిత్రంగా అప్పట్లో టైటానిక్‌ మువీ పేరు మారుమోగిపోయింది. ఇక ఆస్కార్ వేదికపై ఏకంగా 11 అవార్డులు కైవసం చేసుకుంది. ఇప్పటివ‌ర‌కు అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రాల‌లో టైటానిక్ రెండో స్థానంలో నిలిచింది. 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించిన జాన్ లాండౌ.. అంచెలంచెలుగా ఎదిగాడు.

ఇక లాండౌ నిర్మతగా 2009లో ‘అవతార్’, 2022లో వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్‌’తో ఆ రికార్డును రెండుసార్లు అగ్రస్థానంలో ఉంచాడు. అద్భుత 3డీ సాంకేతికతతో చిత్రీకరించబడిన ఈ రెండు మువీలు థియేటర్లలో ప్రదర్శించబడిన ఓ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసంగా నిలిచిపోయాయి. అవతార్, టైటానిక్ మువీలు బాక్స్-ఆఫీస్ వద్ద కురిపించిన కాసుల వర్షం ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి. సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా మిగిలిపోయింది. లిండౌ.. మువీ నిర్మాతలు ఎలీ, ఈడీ లాండౌ దంపతుల కుమారుడు. 23 జూలై 1960న న్యూయార్క్‌లో జన్మించాడు. ఎలీ లాండౌ 1993లో, ఎడీ లాండౌ 2022లో మరణించారు. జోన్ లాండౌకు భార్య జూలీ లాండౌ, ఇద్దరు కుమారులు జామీ లాండౌ, జోడీ లాండౌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.