జెర్సీ డైరెక్టర్‌తో జతకట్టనున్న ‘చిరుత’.. వచ్చే ఏడాది సమ్మర్లో ప్రారంభంకానున్న షూటింగ్ ?..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం రామ్ చరణ్‌కి కరోనా పాజిటివ్ రావడంతో అటు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం రామ్ చరణ్‌కి కరోనా పాజిటివ్ రావడంతో అటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు తనను కలిసిన వారందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
తాజాగా చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఫిబ్రవరి నాటికి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోననున్నట్లుగా తెలుస్తోంది. కాగా అటు యువ దర్శకుడు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చరణ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ బాలీవుడ్లో జెర్సీ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. జెర్సీ రీమేక్ తర్వాత గౌతమ్, చరణ్‌తో సినిమా తీయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారు. అయితే వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చరణ్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.




