ఆ సినిమా కోసం ఒక్కరోజే పని చేశా.. కానీ విపరీతమైన పేరు వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన జయప్రకాష్ రెడ్డి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి. ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించిన ఆయన తన కామెడీతోనూ ప్రేక్షకులను నవ్వించారు. గుండెపోటుతో జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నటుల్లో జయప్రకాష్ రెడ్డి ఒకరు. తన నటనతో , హావభావాలతో పాత్రలకు ప్రాణం పోశారు జయప్రకాశ్ రెడ్డి. కాగా జయప్రకాష్ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన పిల్లలు జీవితంలో స్థిరపడి సంతోషంగా ఉన్నారని, ఇది తనకు ఎంతో మనశ్శాంతిని ఇస్తోందని ఆయన అన్నారు. పిల్లలు తమకు సరిపోయినంత సంపాదించుకుంటూ, హ్యాపీగా జీవిస్తున్నారని, తాను వారికి ఇవ్వాల్సింది ఇచ్చేశానని చెప్పారు. జయప్రకాష్ రెడ్డి తన జీవితంలో ఎదురైన ఆర్థిక సవాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు మూడు నాలుగేళ్ళు అప్పులు తీర్చుకోవడానికే సరిపోయాయని, ఆ తర్వాత సంపాదించిందంతా కుటుంబం కోసమేనని వివరించారు. కోట్లు సంపాదించడం తన లక్ష్యం కాదని, ఉన్నంతలో సంతోషంగా ఉండటమే ముఖ్యమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్
ఒకానొక దశలో చిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపని జయప్రకాష్ రెడ్డి, తనకి మెయిన్ విలన్, హీరోయిన్ ఫాదర్ వంటి కీలక పాత్రలు లభించిన తర్వాత వన్ డే, వన్ సీన్ పాత్రలు చేయనని భీష్మించానని గుర్తు చేసుకున్నారు. అయితే, ఢీ సినిమా తన కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్ అని, ఒక్క డైలాగ్ లేకుండానే విపరీతమైన పేరు వచ్చిందని వివరించారు. ఆ తర్వాత రెడీ వంటి చిత్రాలు చేశానని, ఇప్పుడు నాలుగు రోజుల పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కబడ్డీ కబడ్డీ చిత్రం గురించి మాట్లాడుతూ, ఒక్కరోజు మాత్రమే పని చేసినప్పటికీ ఆ సినిమా తనకు సమరసింహారెడ్డి కంటే ఎక్కువ పేరు తీసుకువచ్చిందని, ఇప్పటికీ ఆ డైలాగులను గుర్తు చేసుకుని నవ్వుకుంటానని చెప్పారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ఆనందం కూడా తనకి మంచి పేరు తెచ్చిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు
బాపు గారు, బాలచందర్ వంటి గొప్ప దర్శకులతో పనిచేయాలని కోరుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదని జయప్రకాష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలచందర్ తన అలెగ్జాండర్ నాటకాన్ని చూడటానికి అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్తే, ఆయన తనయుడు ఐసీయూలో ఉండటం వల్ల రాలేకపోయారని, కానీ గణేష్ పాత్రో గారిని పంపారని గుర్తు చేసుకున్నారు. దాసరి నారాయణరావు గారు తనకు గురువుతో సమానమని, ఆయనే నల్గొండలో నాటకం చూసి రామానాయుడు గారికి అప్పగించి తనను సినిమా రంగంలోకి తీసుకువచ్చారని తెలిపారు. శ్రీను వైట్ల, వినాయక్ వంటి దర్శకులతో పని చేయడం ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన అన్నారు.ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
