Nirupam Paritala: భార్యతో కలిసి కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో
కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఈ నటుడికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా డాక్టర్ బాబు కొత్త కారు కొన్నాడు.

కార్తీక దీపం సీరియల్ తో బాగా పాపులర్ అయిపోయాడు నిరుపమ్ పరిటాల. అంతుకు ముందు కూడా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించినా ఈ సీరియల్ తోనే బాగా క్రేజ్ తెచ్చుకున్నాడీ బుల్లితెర నటుడు. ఈ సీరియల్ లో నిరుపమ్ పోషించిన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పాత్ర బాగా ఫేమస్ అయిపోయింది. ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా బుల్లితెరపై బాగా ఫేమస్. వీరిద్దరూ చంద్రముఖి సీరియల్ లో కలిసి నటించారు. ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ దంపతులకు అక్షజ్ ఓంకార్ అనే కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే డాక్టర్ బాబు తాజాగా ఒక కొత్త కారు కొన్నాడు. తన భార్య మంజులతో కలిసి షోరూమ్ కు వెళ్లిన అతను ప్రముఖ ఎంజీ బ్రాండ్‌కు చెందిన ఈవీ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఈ శుభవార్తను మంజులనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘నా కొత్త కారు’ అంటూ అంటూ తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బుల్లితెర నటి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు అభినందనలు చెబుతున్నారు. కాగా మార్కెట్లో ఈ ఈవీ కారు విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
కాగా ప్రముఖ నటుడు ఓంకార్ కుమారుడే నిరుపమ్ పరిటాల. 2006లో చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత మూగమనసులు, అత్తారింటికి దారేది, మావి చిగురు, కన్యాదానం, కలవారి కోడళ్లు, కలియుగ రామాయణం,గృహ ప్రవేశం, కుంకుమ పువ్వు, రాధకు నీవే రా ప్రాణం, కార్తీక దీపం తదితర సీరియల్స్ లో నటించి బుల్లితెర స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
కొత్త కారుతో డాక్టర్ బాబు.. వీడియో
View this post on Instagram
ఇక నిరుపమ్ 2009లో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. 2014లో ఎన్టీఆర్ రభస సినిమాలో నటించాడు. అలాగే 2017లో విడుదలైన నెక్ట్స్ నువ్వే సినిమాకి మాటలు రాశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




