Rythu Bharosa: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల.. మీకు వచ్చాయా
తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వానా కాలం పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుభరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రెండు ఎకరాల్లోపు సుమారు 44.28 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్ల నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సులో పాల్గొన్న ఆయన బటన్ నొక్కి నిధుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఖాతాల్లో మూడు విడతల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల జమ చేయాలనే లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం మంగళవారం తొలి విడతగా రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఖాతాల్లో నిధులు జమ చేసింది. అంటే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యారు.
ఇక తొలి విడతలో భాగంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న సుమారు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద రూ. 2,482.02 కోట్ల జమ చేశారు. ఇందులో ఒక ఎకరం లోపు ఉన్న రైతులు 14.65 లక్షల మంది ఉండగా.. వారి ఖాతాల్లో రూ. 878.94 కోట్లు, రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు 26.72 లక్షల మంది ఉండగా వారి ఖాతాల్లో రూ. 1,603.08 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి జూలై 5 వరకు ఛాన్స్
ఇదిలా ఉండగా ఇప్పటివరకు రైతు భరోసా జాబితాలో పేరు నమోదు కాని వారు లేదా జూన్ 15 లోపు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులకు ప్రభుత్వం మరో ఛాన్స్ కల్పించింది. అర్హులైన కొత్త రైతులు అవసరమైన ధ్రువపత్రాలను తమ గ్రామంలోని ఏఈవోకు అందజేసి పథకానికి ధరఖాస్తూ చేసుకోవాలని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
