AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఇలా ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

రైతు భరోసా నిధులను జూన్ 30వ తేదీన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ డబ్బులు అకౌంట్లో పడకపోతే ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్కోండి. రెండు రోజుల పాటు వెయిట్ చేయండి. అయినా డబ్బులు పడకపోతే ఇలా ఫిర్యాదు చేయవచ్చు.

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఇలా ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..
Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Jun 30, 2026 | 7:18 PM

Share

తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. రైతు భరోసా నిధులను రేవంత్ సర్కార్ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిధులు విడుదల చేశారు. వానాకాలం సీజన్ కోసం రైతు భరోసా నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. జూన్ 30న రెండు ఎకరాల్లోపు పోలం ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు పడనున్నాయి. విడదల వారీగా అందరి రైతులకు అందించనున్నారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున అకౌంట్లలో వేయనున్నారు. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు అందించనుండగా.. ఇవాళ 2 ఎకరాల్లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు అకౌంట్లలో పడనుంది.

డబ్బులు పడ్డాయా…? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి?

-https://rythubharosa.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించండి

-హోమ్ పేజీలో ‘Beneficiary Status’ లేదా ‘Payment Status’ అనే ఆప్షన్ ఎంచుకోండి

-ఆధార్ నెంబర్ లేదా పట్టాదారు పాస్ బుక్ నెంటర్ నమోదు చేయండి

-సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి

-మీకు డబ్బులు పడ్డాయా లేదా.. ఏ అకౌంట్లో పడ్డాయి.. ఎన్ని డబ్బులు పడ్డాయి అనే వివరాలు కనిపిస్తాయి

డబ్బులు పడకపోతే ఏం చేయాలి..?

స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు పడనట్లయితే.. మీ పట్టాదారు పాస్ బుక్, భూమి వివరాలు చెక్ చేసుకోవాలి. మీ మండలం పరిధిలోని గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. లేదా మండల వ్యవసాయ అధికారిని కూడా సంప్రదించవచ్చు. డబ్బులు పడకపోవడానికి గల కారణం తెలుసుకోండి. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరించుకోండి. పట్టాదారు పాస్ బుక్ లో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లో పేరు ఒకేలా ఉందా.. లేదా అనేది చెక్ చేస్కోండి. పేరు తప్పుగా ఉంటే డబ్బులు ఆగిపోయే అవకాశముంది. ఇక ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వంటివి లింక్ అయ్యారా లేదా అనేది చెక్ చేస్కోండి. సాంకేతిక సమస్యల వల్ల నగదు జమకాని రైతులు బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఐఎఫ్‌ఎస్​సీ కోడ్‌ నంబర్లను సరిచేసుకోవాలని

Follow Us