రోజుకో గుడ్డు తింటున్నారా? అయితే, ఇది మీ కోసమే డోంట్ మిస్!
30 June 2026
Jyothi Gadda
కండరాల బలం: గుడ్డులో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి, బరువు నియంత్రణకు ఎంతగానో తోడ్పడుతుంది.
మెదడు చురుకుదనం: గుడ్డులో ఉండే కోలిన్ (Choline) అనే పోషకం మెదడు కణాల అభివృద్ధికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
కంటి చూపు మెరుగుదల: ఇందులో ఉండే లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తాయి.
అమితంగా తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ (నష్టాలు): ప్రయోజనాలు ఉన్నాయి కదా అని రోజుకు 3-4 గుడ్లు తింటే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
గుడ్డు తెల్లసొన లో కేవలం ప్రొటీన్ మాత్రమే ఉంటుంది, కానీ పచ్చసొన లో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే గుండె జబ్బులు లేదా హై-కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు పచ్చసొనను ఎక్కువగా తింటే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ.
కోడిగుడ్డు స్వభావరీత్యా శరీరంలో వేడిని (Heat) పెంచుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ గుడ్లు తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
చర్మ సమస్యలు, మొటిమలు: శరీరంలో వేడి పెరగడం వల్ల కొందరి ముఖంపై హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, మొటిమలు (Acne) లేదా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే, కేవలం ప్రొటీన్ మాత్రమే కావాలనుకునే వారు పచ్చసొనను పక్కన పెట్టి, కేవలం తెల్లసొనను మాత్రమే తీసుకోవాలి.