AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hailesso: సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్.. పవర్ ఫుల్ పాత్రలో ఆ సీనియర్ నటుడు

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై బిజీ బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో అతను కూడా ఒకడు. ప్రస్తుతం టీవీ షోస్, ఓటీటీ షోలకు హోస్ట్ గా కొనసాగుతోన్న సుధీర్ మరోవైపు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు.

Hailesso: సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్.. పవర్ ఫుల్ పాత్రలో ఆ సీనియర్ నటుడు
Hailesso Movie
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2026 | 7:38 PM

Share

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌( సుడిగాలి సుధీర్)కు హీరోగా ఐదవ చిత్రం.  ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై సుధీర్ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. బుల్లితెర పై సక్సెస్ అయిన సుధీర్ హీరోగానూ రాణించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు సుధీర్ గోట్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హైలెస్సో సినిమాలో సుదీర్ డిఫరెంట్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సుధీర్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ లైలం బాబు’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శివాజీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్‌లో నల్లటి దుస్తులు, పంచెకట్టుతో రాతి సింహాసనంపై కూర్చొని, చేతిలో సీసా పట్టుకుని శివాజీ కనిపించిన తీరు ఆయన పాత్రలోని పవర్ ని చూపిస్తోంది. ‘లైలం బాబు’ పాత్రలో శివాజీ తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ ఈ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకోసం యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌ బ్రహ్మ కడలి, చింతా శ్రీనివాస్ రైటర్ గా పని చేస్తున్నారు. కాగా హై లెస్సో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us