AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Raj : ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడో తెలిస్తే.. మీరు అలాగే చేస్తారు.. అసలు విషయం చెప్పిన హీరో అఖిల్ రాజ్

‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ డెలివరీ బాయ్‌ పై అతను దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఆర్డర్ చేసిన ఫుడ్ కు బదులు డెలివరీ బాయ్ రాంగ్ ఆర్డర్ ఇవ్వడంతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Akhil Raj : ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడో తెలిస్తే.. మీరు అలాగే చేస్తారు.. అసలు విషయం చెప్పిన హీరో అఖిల్ రాజ్
Akhil Raj
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2026 | 4:44 PM

Share

రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిల్ రాజ్. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ నటించాడు ఈ హీరో. ఇప్పుడిప్పుడే హీరోగా రాణిస్తున్న అఖిల్ రాజ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఓ డెలివరీ బాయ్ పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ కు బదులు డెలివరీ బాయ్ రాంగ్ ఆర్డర్ ఇవ్వడంతోనే గొడవ జరిగిందని తెలుస్తుంది. అఖిల్ రాజ్ దాడి చేస్తున్న సమయంలో ఆ డెలివరీ బాయ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. దాంతో హీరో పై చాలా మంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం పై అఖిల్ రాజ్ స్పందించాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. ఆ డెలివరీ బాయ్ తాగేసి ఉన్నాడు. మా అమ్మ గుర్తి తప్పుగా మాట్లాడాడు అందుకే అతనిని తిట్టం అంతే కానీ నేను అతన్ని కొట్టలేదు. కావాలనే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ.. వీడియో తీశాడు. అతన్ని ఆపడానికి నేను ప్రయత్నించా.. తప్పు నాదైతే నేను సారీ చెప్పడానికి రెడీ కానీ అతను మా అమ్మను ఇష్టమొచ్చినట్టు తిట్టాడు అంటూ వీడియో షేర్ చేశాడు.

Follow Us