అందంతో చంపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట దివి గ్లామర్ సొగసులు

Rajitha Chanti

Pic credit - Instagram

30 Jun 2026

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది నటి దివి వైద్య. అంతకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. 

హౌస్‌లో ఉన్నంత కాలం తనదైన శైలిలో ఆటతీరుతో, స్పష్టమైన మాటలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతూ మరింత పాపులర్ అయ్యింది.

కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తన ముద్ర వేస్తోంది. గ్లామర్ పరంగానూ దివి ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో మరింత అందంగా కనిపిస్తుంది.

ఈ ఫొటో షూట్‌లో దివి తన నడుమందాలతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారుకు అస్సలు నిద్ర లేకుండా చేస్తోంది. సాంప్రదాయ లుక్‌తో పాటు మోడ్రన్ టచ్ ఇస్తున్న ఆ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. 

ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "దివి లుక్స్ అదిరిపోయాయి", "నడుమందాలతో చంపేస్తోంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలు షేర్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో లైకులు రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' వంటి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు  పోషించింది.

 టాలీవుడ్‌లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ, ఇలాంటి గ్లామరస్ ఫోటో షూట్‌లతో మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. రాబోయే రోజుల్లో హీరోయిన్‌గా స్థిరపడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.