AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: నోరు జారీ అప్పుడు అలా మాట్లాడాను.. చిరంజీవి గారు నన్ను క్షమించండి..

మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే

Chiranjeevi: నోరు జారీ అప్పుడు అలా మాట్లాడాను.. చిరంజీవి గారు నన్ను క్షమించండి..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2026 | 4:23 PM

Share

ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ తన సినీ ప్రస్థానం, విజయాలు, వివాదాలు, అలాగే దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గజాలతో తన అనుబంధం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నరసింహ నాయుడు (బాలకృష్ణ), ఇంద్ర (చిరంజీవి) వంటి చిత్రాలతో అఖండ విజయాలు సాధించి, అల్లు అర్జున్‌ను గంగోత్రితో పరిచయం చేసిన ఘనత చిన్నికృష్ణది. తాజాగా దాసరి నారాయణరావు గారితో తన తొలి పరిచయం, ఆయన కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా పరిచయం అయిన సినిమా కోసం గోస్ట్ రైటర్‌గా పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో తను కాదలిక్కుం మర్యాదై అనే తమిళ సినిమాను చూసి, దాసరి గారిని కూడా చూడమని కోరారు. ఆ సినిమా చూసిన దాసరి గారు భావోద్వేగానికి లోనయ్యారని, ఆ సినిమాను కొనుగోలు చేసి తన కుమారుడితో తీయమని తాను సలహా ఇచ్చినట్లు చిన్నికృష్ణ తెలిపారు. అయితే, ఆ తర్వాత దాసరి గారి కుమారుడి చిత్రం గ్రీకు వీరుడు పేరుతో వేరే టైటిల్, కథతో ముందుకు సాగడం తనను నిరాశపరిచిందని, టైటిల్ వల్ల సినిమాలు ఆడవని తాను గట్టిగా నమ్ముతానని పేర్కొన్నారు. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

మెగాస్టార్ చిరంజీవి గారి 150వ చిత్రానికి శివయ్య నాయుడు అనే కథను తాను సిద్ధం చేసినప్పటికీ, మురుగదాస్ గారి కత్తి చిత్రం తెలుగు రీమేక్ ఖైదీ నంబర్ 150గా రావడాన్ని తాను సంతోషంగా అంగీకరించినట్లు చిన్నికృష్ణ వివరించారు. ఒక భాషలో విజయం సాధించిన కథను నిర్మించడం సులభమని, తన సొంత కథకు దర్శకుడు పూర్తి స్థాయి కృషి చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కంటెంట్ జనంలోకి వెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని, తాను రీచ్ అవ్వాలని ఎప్పుడూ అనుకోనని అన్నారు. తాను ఏ సినిమాకైనా వర్క్ చేస్తే అది ఫ్లాప్ కాదని, తన వల్ల నిర్మాతకు నష్టం గానీ, హీరోకు చెడ్డపేరు గానీ రాదని చిన్నికృష్ణ అన్నారు.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

ఒకవేళ తన ఆలోచన చెడ్డదనిపిస్తే తనే దాన్ని కట్ చేసుకుంటానని, మంచి ఆలోచన అయితేనే పేపర్ మీద పెడతానని తెలిపారు. సమాజంలోని మంచిని స్వీకరిస్తానని, చెడును మాత్రం తీసుకోనని ఆయన అన్నారు. చివరగా, ఇంద్ర సినిమా విజయోత్సవం తర్వాత చిరంజీవి గారు తనను కనీసం ఇంటికి పిలిచి సత్కరించలేదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “నాకు కొడుకు పుడితే చిరంజీవి అని పేరు పెట్టుకున్నాను. అజ్ఞానంతో అప్పుడు అలా మాట్లాడాను. నన్ను క్షమించండి. నా చివరి శ్వాస వరకు అన్నయ్యపై, వారి కుటుంబంపై నా ప్రేమ చెక్కుచెదరదు,” అంటూ క్షమాపణ చెప్పారు. మనల్ని ప్రేమించాలని ఎవరికీ షరతులు విధించకూడదని తాను ఇప్పుడు అర్థం చేసుకున్నానని అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us