ఆకట్టుకుంటోన్న ‘కోమలి’ ఫస్ట్ లుక్..!

జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నూతన దర్శకుడు ప్రదీప్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘కోమలి’. వేల్స్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. చేతికి సెలైన్ బాటిల్, తలకు బ్యాండ్‌తో పేషంట్ గెటప్‌లో ఉన్న జయం రవి పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక బ్యాగ్రౌండ్‌లో సామజిక మాధ్యమాలకు సంబంధించిన గుర్తులు ఉండటంతో ఈ సినిమా యువతకు సోషల్ మీడియాపై మెసేజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ సంయుక్త హెగ్డే కీలక […]

ఆకట్టుకుంటోన్న కోమలి ఫస్ట్ లుక్..!

Edited By:

Updated on: May 19, 2019 | 5:42 PM

జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నూతన దర్శకుడు ప్రదీప్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘కోమలి’. వేల్స్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. చేతికి సెలైన్ బాటిల్, తలకు బ్యాండ్‌తో పేషంట్ గెటప్‌లో ఉన్న జయం రవి పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక బ్యాగ్రౌండ్‌లో సామజిక మాధ్యమాలకు సంబంధించిన గుర్తులు ఉండటంతో ఈ సినిమా యువతకు సోషల్ మీడియాపై మెసేజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ సంయుక్త హెగ్డే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి హిప్ హోప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి.