Jai Bhim: సూర్య హీరోగా తెరకెక్కిన జై భీమ్ చిత్రం రికార్డులను తిరగరాస్తూనే ఉంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్‌తోనే ఇండియా మొత్తం చుట్టేస్తోంది. దళిత వర్గానికి చెందిన వారిపై పోలీసులు ఎలాంటి దాష్టికాలకు పాల్పడ్డారు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. దగాపడ్డ దళితుల తరఫున నిలబడి వాదించిన లాయర్ పాత్రలో సూర్య నటన అద్భుతంగా ఉంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన చర్చే జరుగుతోంది. ఏ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నా.. ‘జై భీమ్’ చూశావా.? అని ప్రశ్నిస్తున్నారంటే ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
1995లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమాను జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. దీంతో ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ సినిమాల జాబితాలో జై భీమ్ ఏకంగా మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. సుమారు 53,000 ఓట్లు, 9.6 రేటింగ్‌తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న ప్రముఖ చిత్రం ది షాషాంక్ రిడంప్షన్‌ను వెనక్కి నెట్టి మరీ జై భీమ్ దూసుకుపోయింది. ఇక ప్రపంచ ప్రఖ్యాత సినిమా గాడ్ ఫాదర్ మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే సూర్య హీరోగా తెరకెక్కిన.. ఐఎమ్‌డీబీ టాప్ 10 జాబితాలో చోటు దక్కించునున్న వాటిలో జై భీమ్ రెండో చిత్రం కావడం విశేషం. గతంలో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దు రా) సినిమా ఐఎమ్‌డీబీ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
#JaiBhim in IMDB. pic.twitter.com/KQCdcTJRKo
— Christopher Kanagaraj (@Chrissuccess) November 8, 2021
Also Read: Heart Stroke: గుండెపోటులో 2 రకాలు.. మినీ స్ట్రోక్ vs రెగ్యులర్ స్ట్రోక్.. అంటే ఏంటో తెలుసుకోండి..