Jagapathi Babu: సినిమాలో శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే వెళ్లగానే ఆ హీరోయిన్ బోరున ఏడ్చేసింది
ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగారు జగపతి బాబు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగానూ రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన జగ్గూభాయ్ ఒక హీరోయిన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు జగపతి బాబు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా తన ట్యాలెంట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగ్గూభాయ్. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మొన్నటివరకు హీరోగా ఓ వెలుగు వెలిగిన జగ్గూ భాయ్ ఇప్పుడు విలన్ గా రాణిస్తున్నారు. అలాగే సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపైనా మెరుస్తున్నారీ సీనియర్ యాక్టర్. ఓటీటీ షోలకు కూడా హోస్టుగా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ బిజీగా ఉంటోన్న జగ్గూ భాయ్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో ఓ హీరోయిన్ శోభనం సీన్ అంటే ఎలా ఏడ్చిందో చెప్పి.. అందరిని నవ్వించారు. ఇంతకీ జగ్గూ భాయ్ తో శోభనం సీన్ అనగానే ఏడ్చిన ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార లయ.
టాలీవుడ్ లో జగపతి బాబు- లయది కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘మనోహరం’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ మధ్యన ‘వదలా’ అనే ఓ హారర్ థ్రిల్లర్ సినిమాలోనూ భార్యాభర్తలుగా నటించారు జగ్గూ భాయ్- లయ. ఈ సినిమా ప్రమోషన్లలోనే లయ గురించి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు జగపతి బాబు. ‘మనోహరం’ సినిమా షూటింగ్ సమయంలో లయ చాలా చిన్న పిల్ల. అప్పట్లో ఆమె వయసు కూడా చాలా తక్కువే. ఆమెను చూసినప్పుడల్లా నాకు చిన్న పిల్ల అనే భావనే కలిగేది. అయితే నా ఉద్దేశంలో అప్పటికంటే ఇప్పుడే లయ ఇంకా క్యూట్‌గా కనిపిస్తోంది’ అని లయపై ప్రశంసలు కురిపించారు జగపతి బాబు. ఇదే క్రమంలో మనోహరం సినిమా షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘ ఆ (మనోహరం) సినిమాలో శోభనం (ఫస్ట్ నైట్) సీన్ చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు చెప్పినట్లు నేను బెడ్ వైపు వెళ్లగానే లయ ఒక్కసారిగా భయపడిపోయింది. బోరున ఏడ్చేసింది. అప్పట్లో ఆమె చాలా అమాయకురాలు. అయితే ఆ సంఘటన ఇప్పటికీ నాకు పచ్చబొట్టులా గుర్తుండిపోయింది’ అని చెప్పి అందరినీ నవ్వించారు జగ్గూభాయ్. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మనోహరం సినిమాలో జగపతిబాబు, లయ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




