jagapathi babu: కరోనాకు థాంక్స్ చెప్పిన జగ్గు భాయ్.. ఫన్నీ ట్వీట్ చేసిన జగపతిబాబు..

కరోనా కల్లోలం ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకు ఉదృతంగా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది.

jagapathi babu: కరోనాకు థాంక్స్ చెప్పిన జగ్గు భాయ్.. ఫన్నీ ట్వీట్ చేసిన జగపతిబాబు..

Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 19, 2021 | 7:46 AM

jagapathi babu: కరోనా కల్లోలం ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకు ఉదృతంగా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రజలు వేల సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. సినిమా స్టార్ ను కూడా  ఈ మహమ్మారి వదలడం లేదు. సినిమా కార్మికులు, నటులు కరోనా బారిన పడుతుండటంతో అందరు ఆందోళన చెందుతున్నారు. టాలీవుడ్ విషయానికొస్తే  పవన్ కల్యాణ్ తోపాటు దిల్ రాజు బండ్ల గణేష్ తదితరులు చాలా మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జగపతిబాబు కూడా కరోనా పై సెటైర్లు వేశారు.

తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. జగపతి బాబు తాజాగా ఆయన తనకు తాను మేకప్ వేసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోకు  ‘థాంక్స్ కరోనా.. నాకు నేనే మేకప్ మెన్ గా మారిపోయాను. హా..హా..’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు జగపతి బాబు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా తో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతి బాబు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్  గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Telangana Devudu Movie: ‘తెలంగాణ దేవుడు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Ishq Movie Pre Release Event: ‘ఇష్క్’ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వస్తున్నా తేజ సజ్జ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్…

నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…