‘సాహో’ ఐటెం సాంగ్.. ప్రభాస్‌తో చిందేయనున్న జాక్వెలిన్!

'సాహో' ఐటెం సాంగ్.. ప్రభాస్‌తో చిందేయనున్న జాక్వెలిన్!

ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ షూట్ జరుగుతోంది. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కూడా ఉందని గతంలోనే యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సాంగ్‌లో నటించడానికి కొంతమంది పేర్లు పరిశీలించారట దర్శక నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నారని వినికిడి. ఐటెం […]

Ravi Kiran

|

Jul 04, 2019 | 5:15 AM

ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ షూట్ జరుగుతోంది. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కూడా ఉందని గతంలోనే యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సాంగ్‌లో నటించడానికి కొంతమంది పేర్లు పరిశీలించారట దర్శక నిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నారని వినికిడి. ఐటెం సాంగ్‌ను యూరప్‌లోని క్రొయేషియాలో షూట్ చేస్తున్నారని సమాచారం.  కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu