గిన్నీస్ రికార్డు సాధించిన హాలీవుడ్ హీరో

ప్రముఖ హాలీవుడ్ నటుడు హ్యూగ్‌ జాక్‌మ్యాన్ గిన్నీస్ రికార్డును సాధించారు. 16 ఏళ్లుగా హాలీవుడ్ సిరీస్ వాల్వరిన్‌లో ప్రధాన పాత్రలో నటిస్తూ.. లైవ్ యాక్షన్ మార్వెల్ సూపర్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ టాలెంట్‌కు గిన్నీస్ రికార్డు వరించింది. ఈ నేపథ్యంలో సినిమాలవైపు వచ్చిందే ఈ రికార్డు కోసమని సోషల్ మీడియలో తన సంతోషాన్ని పంచుకున్నారు. కాగా మ్యూజికల్ థియేటర్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించారు జాక్‌మ్యాన్. తన అద్భుతమైన నటన నైపుణ్యాలు, పాటలతో గ్రామీ, ఎమ్మీ, టోని, […]

గిన్నీస్ రికార్డు సాధించిన హాలీవుడ్ హీరో
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:12 PM

ప్రముఖ హాలీవుడ్ నటుడు హ్యూగ్‌ జాక్‌మ్యాన్ గిన్నీస్ రికార్డును సాధించారు. 16 ఏళ్లుగా హాలీవుడ్ సిరీస్ వాల్వరిన్‌లో ప్రధాన పాత్రలో నటిస్తూ.. లైవ్ యాక్షన్ మార్వెల్ సూపర్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ టాలెంట్‌కు గిన్నీస్ రికార్డు వరించింది. ఈ నేపథ్యంలో సినిమాలవైపు వచ్చిందే ఈ రికార్డు కోసమని సోషల్ మీడియలో తన సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా మ్యూజికల్ థియేటర్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించారు జాక్‌మ్యాన్. తన అద్భుతమైన నటన నైపుణ్యాలు, పాటలతో గ్రామీ, ఎమ్మీ, టోని, గోల్డెన్ గ్లోబ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు.