‘బ్రూస్‌లీ’ ఒక్కసారిగా నా తలపై కొట్టారు: జాకీచాన్
బ్రూస్‌లీ, జాకీ చాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేర్లు తెలియని వారుండరు. ఎందుకంటే.. వీరిద్దరూ.. అంత ఫేమస్ మరి. చిన్నవారి నుంచి.. పెద్దవారి వరకూ.. వీరికి వీరాభిమానులు ఎక్కువ. ముఖ్యంగా ‘బ్రూస్‌లీ’ చాలా మంది జీవితాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యులు కూడా. బ్రూస్ లీ అనగానే.. ‘కుంగ్ ఫూ’ ఎక్కువగా గుర్తొస్తుంది. అలాగే.. జాకీచాన్‌కి కూడా.. యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరూ చివరిగా కలిసి నటించిన సినిమా.. ‘ఎంటర్ ది డ్రాగన్’. ఈ […]
బ్రూస్లీ, జాకీ చాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేర్లు తెలియని వారుండరు. ఎందుకంటే.. వీరిద్దరూ.. అంత ఫేమస్ మరి. చిన్నవారి నుంచి.. పెద్దవారి వరకూ.. వీరికి వీరాభిమానులు ఎక్కువ. ముఖ్యంగా ‘బ్రూస్‌లీ’ చాలా మంది జీవితాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యులు కూడా. బ్రూస్ లీ అనగానే.. ‘కుంగ్ ఫూ’ ఎక్కువగా గుర్తొస్తుంది. అలాగే.. జాకీచాన్‌కి కూడా.. యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరూ చివరిగా కలిసి నటించిన సినిమా.. ‘ఎంటర్ ది డ్రాగన్’. ఈ సినిమాలో యాక్షన్ హీరో జాకీచాన్ స్టంట్‌మెన్‌గా వర్క్ చేశారు.
తాజాగా.. ఈ సినిమా సెట‌్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు జాకీచాన్. అదే.. బ్రూస్‌లీకి.. నన్ను దగ్గర చేసింది చెప్పుకొచ్చారు చాన్. షూటింగ్ సమయంలో.. ఓ యాక్షన్ సన్నివేశం ఉందని.. ఆ టైంలో నేను కెమెరా వెనుక ఉన్నానని.. కానీ.. హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అదే సమయంలో.. బ్రూస్లీ చేతితో తిప్పుతున్న కర్ర నా కుడివైపు బలంగా తగిలింది. అంతే.. ఒక్కసారిగా.. కళ్లు బైర్లు కమ్మాయని.. కింద పడిపోయానని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కట్ చెప్పగానే.. బ్రూస్లీ వచ్చి నన్ను పట్టుకుని.. క్షమించమని అడిగినట్టు చెప్పారు. ఆ తర్వాత నాకు పెద్దగా నొప్పి లేకపోయినా.. నేను మాత్రం.. కావాలని.. ఆయన వద్ద బాధతో ఉన్నట్లు నటించినట్టు.. అదే నన్ను దగ్గర చేసినట్టు చెప్పారు జాకీచాన్.