Suriya 24 Movie: సూర్య ఈసారి భ‌విష్య‌త్తులోకి వెళ్తాడా..? సిద్ధ‌మైన 24 సీక్వెల్ క‌థ‌..

Surya 24 Movie: ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ వ‌చ్చిన చిత్రం 24. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా మూవీ ల‌వ‌ర్స్‌ను మ‌రో కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. ఇప్ప‌టి వ‌ర‌కు టైమ్ ట్రావెలింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రాల‌కు విభిన్నంగా..

Suriya 24 Movie: సూర్య ఈసారి భ‌విష్య‌త్తులోకి వెళ్తాడా..? సిద్ధ‌మైన 24 సీక్వెల్ క‌థ‌..

Updated on: Jan 24, 2022 | 8:14 AM

Suriya 24 Movie: ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ వ‌చ్చిన చిత్రం 24. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా మూవీ ల‌వ‌ర్స్‌ను మ‌రో కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. ఇప్ప‌టి వ‌ర‌కు టైమ్ ట్రావెలింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రాల‌కు విభిన్నంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌. ముఖ్యంగా సూర్య రెండు విభిన్న పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్న తీరుకు అంద‌రూ ఫిదా అయ్యారు. ఇక వాచ్‌లో స‌మ‌యాన్ని వెన‌క్కి తిప్పితే గ‌తంలోకి వెళ్లొచ్చు అనే వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌ను ప్రేక్ష‌కుల‌కు ఎంతో అర్థ‌మ‌య్యేలా చూపించారు విక్ర‌మ్‌.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించే ఆలోచ‌న ఉంద‌ని సినిమా విడుద‌ల‌ప్పుడు విక్ర‌మ్ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుద‌లైన సుమారు ఆరేళ్లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్నా ఇప్ప‌టికీ సీక్వెల్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై ఓ వార్త వ‌చ్చింది. 24 సినిమా సీక్వెల్ ప్ర‌య‌త్నాలు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. క‌థ సిద్ధ‌మైంద‌ని,ఈ ఏడాదిలోనే సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయ‌ని స‌నీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే మొద‌టి పార్ట్ ముగిసే స‌మ‌యానికి సూర్య టైమ్ ట్రావెలింగ్ వాచ్‌ను నీటిలోకి విసిరేసిన‌ట్లు చూపించారు. మ‌రి సూర్య మ‌ళ్లీ అలాంటి వాచ్‌ను మ‌ళ్లీ త‌యారు చేస్తాడా.? ఈసారి ఆ వాచ్‌తో భ‌విష్య‌త్తులోకి వెళ్తాడా.? అస‌లు విక్ర‌మ్ ప్రేక్ష‌కులు ఏం చూపించ‌నున్నాడ‌న్న ఆస‌క్తికర క‌థాంశంతో సీక్వెల్‌పై ఇప్ప‌టికే అంచ‌నాలు పెరిగిపోయాయి.

Also Read: Team India: ‘ఫిట్’ మ్యాన్‌‌గా ఉంటేనే సారథిగా రాణిస్తాడు.. కోహ్లీ, రోహిత్‌లపై మాజీ హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!

Road Accident: కరీంనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని 20 మందికి గాయాలు

Viral Video: ‘అలా వచ్చిన అతిథులకే వింధు భోజనం పెట్టండి..’ నూతన వధూవరుల క్రేజీ రూల్.. అందరూ షాక్