Balakrishna: బాలయ్య కోసం బాలీవుడ్‌ బ్యూటీని దింపనున్న అనిల్‌ రావిపూడి.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఓకే చెప్పేనా.?

Balakrishna: అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందకున్నారు నట సింహం బాలకృష్ణ. లెజెండ్‌ సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకుందీ చిత్రం. కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టాలీవుడ్‌కు అఖండ బూస్ట్‌ ఇచ్చిందని..

Balakrishna: బాలయ్య కోసం బాలీవుడ్‌ బ్యూటీని దింపనున్న అనిల్‌ రావిపూడి.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఓకే చెప్పేనా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 29, 2022 | 10:37 AM

Balakrishna: అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందకున్నారు నట సింహం బాలకృష్ణ. లెజెండ్‌ సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకుందీ చిత్రం. కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టాలీవుడ్‌కు అఖండ బూస్ట్‌ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బాలకృష్ణ కూడా వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే గోపిచంద్‌ మలినేనితో ఓ సినిమాను పట్టాలెక్కించారు. ‘ఎన్‌బీకే 107’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ కంప్లీట్‌ న్యూలుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతి హాసన్‌ నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా షూటింగ్‌ పూర్తికాక ముందే 108వ చిత్రాన్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య డిఫ్రంట్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య సరసన బాలీవుడ్‌ బ్యూటీని దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Balakrishna 108

ఇవి కూడా చదవండి

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను ఈ పాత్ర కోసం ఇప్పటికే సంప్రదించారని, దానికి సోనాక్షి సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్‌ గతంలో ఈ పాత్ర కోసం ప్రియమణిని సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ దీనిపై ఆ తర్వాత ఎలాంటి ప్రకటన రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి